calender_icon.png 30 October, 2024 | 1:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సిరీస్ క్లీన్‌స్వీప్

31-07-2024 03:07:31 AM

  1. సూపర్ ఓవర్‌లో టీమిండియా విజయం
  2. ఆగస్టు 2 నుంచి వన్డే సిరీస్

పల్లెకెలె: శ్రీలంకతో జరిగిన మూడు టీ20ల సిరీస్‌ను టీమిండియా 3 కైవసం చేసుకుంది. మంగళవారం లంకతో జరిగిన నామమాత్రమైన మూడో టీ20లో టీమిండియా సూపర్ ఓవర్‌లో థ్రిల్లింగ్ విజయాన్ని నమోదు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 137 పరుగులే చేసింది. శుబ్‌మన్ గిల్ (37 బంతుల్లో 39; 3 ఫోర్లు) టాప్ స్కోరర్. లంక బౌలర్లలో తీక్షణ 3 వికెట్లు తీయగా.. హసరంగా రెండు వికెట్లు పడగొట్టాడు. అనంతరం లక్ష్యఛేధనలో శ్రీలంక 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 137 పరుగులు చేసింది.

పెరీరా (34 బంతుల్లో 46) మాత్రమే రాణించాడు. భారత బౌలర్లలో రవి, సుందర్, సూర్య, రింకూ సింగ్‌లు తలా  2 వికెట్లు పడగొట్టారు. సూపర్ ఓవర్‌లో లంక తొలి మూడు బంతుల్లో రెండు వికెట్లు కోల్పోయి రెండు పరుగులు చేసింది. అనంతరం  తొలి బంతికే బౌండరీ బాదిన టీమిండియా ఘన విజయాన్ని సాధించింది. ఆగస్టు 2 నుంచి ఇరుజట్ల మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. 

కట్టడి చేసిన బౌలర్లు

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఏది కలిసి రాలేదు. పవర్ ప్లే ముగిసేసరికే 30 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో గిల్ ఒంటరి పోరు చేశాడు. అతనికి మిడిలార్డర్ నుంచి సహకారం కరువైంది. ఈ నేపథ్యంలో లోయర్ ఆర్డర్‌లో రియాన్ పరాగ్, వాషింగ్టన్ సుందర్‌లు ఉపయుక్తమైన పరుగులు చేయడంతో భారత్ 137 పరుగుల గౌరవప్రదమైన స్కోరు నమోదు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో ఇన్నింగ్స్‌ను దూకుడుగా ప్రారంభించిన శ్రీలంక 15 ఓవర్ల వరకు విజయం దిశగా పయనించింది. ఈ దశలో బంతిని అందుకున్న స్పిన్నర్లు వరుస విరామాల్లో వికెట్లు తీసి ఒత్తిడి పెంచారు. దీంతో ఆఖరి ఓవర్లో ఆరు పరుగులు చేయాల్సిన దశలో రెండు వికెట్లు పడడంతో లంక ఒత్తిడికి లోనయ్యింది. చివరి బంతికి రెండు పరుగులు రావడంతో మ్యాచ్ సూపర్ ఓవర్‌కు దారి తీసింది.