నందమూరి బాలకృష్ణ చిత్రాల్లో ‘ఆదిత్య 369’ చెప్పుకోదగ్గది. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు నిర్మించిన ఈ చిత్రం 1991లో విడుదలై, బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఇప్పుడు దానికి సీక్వెల్ వస్తోంది. ఈ విషయాన్ని ‘అన్‌స్టాపబుల్ సీజన్ 4’ కార్యక్రమంలో బాలకృష్ణ స్వయంగా వెల్లడించారు. ఈ షోకు సంబంధించి శుక్రవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఆయన ‘ఆదిత్య 369’ గెటప్‌లోనే కనిపించ నున్నారు.
‘ఆదిత్య 999 మ్యాక్స్’ అనే టైటిల్‌తో సీక్వెల్ రూపొందనుందట. “ఆదిత్య 369’కు సీక్వెల్‌గా ‘ఆదిత్య 999’ రానుం ది. మా అబ్బాయి మోక్షజ్ఞ హీరో. ప్రస్తుతం దీని పనులు జరుగుతున్నాయి. త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే 2025లో విడుదల చేస్తాం” అన్నారు.
‘డాకు మహారాజ్’ షూటింగ్ పూర్తి
బాలకృష్ణ నటిస్తున్న ‘డాకు మహారాజ్’ షూటింగ్ బుధవారం పూర్తుంది. బాబీ కొల్లి దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్‌ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది.