ఎస్టీయూటీఎస్
హైదరాబాద్, ఆగస్టు 30 (విజయక్రాంతి): సెప్టెంబర్ 1న పెన్షన్ విద్రోహ దినంగా పాటించాలని ఎస్టీయూటీఎస్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం.పర్వత్‌రెడ్డి, జి.సదానందం గౌడ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ పెన్షన్ విద్రోహ దినం నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నట్ల్లు ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు. 2004 సెప్టెంబర్ ఒకటి నుంచి అమలవుతున్న సీపీఎస్ విధానం వల్ల లక్షలాది మంది ఉద్యోగుల జీవిత భద్రత ప్రశ్నార్థకంగా మారిందని పేర్కొన్నారు.
దేశంలో నాలుగు రాష్ట్రా ల్లో పాత పెన్షన్ పునరుద్ధరణ జరిగిందని, మరో రెండు రాష్ట్రాలు అమలు చేస్తామని ప్రకటించాయని, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణ ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీ ఇచ్చిన పిలుపుమేరకు పెన్షన్ విద్రోహ దినాన్ని ఉద్యోగులు, ఉపాధ్యాయులు విజయవంతం చేయాలని వారు కోరారు.