calender_icon.png 29 October, 2024 | 12:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సెప్టెంబర్ 17 విమోచన దినోత్సవంగా ఎందుకు జరపరు?

16-09-2024 03:35:00 AM

ప్రజాపాలన దినోత్సవంలో భాగస్వామిని కాలేను

  1. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని తుడిచేసే యత్నం
  2. పేరు మార్చడం చరిత్ర వక్రీకరణే
  3. సీఎం రేవంత్‌రెడ్డికి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి బహిరంగ లేఖ

హైదరాబాద్, సెప్టెంబర్ 15 (విజయ క్రాం తి): ఘనమైన తెలంగాణ చరిత్రను ప్రజల స్మృతిపథం నుంచి తుడిచివేసేందుకు జరుగుతున్న ప్రయత్నంలో భాగంగా నిర్వహిస్తున్న ప్రజాపాలన దినోత్సవంలో తాను భాగస్వామిని కాలేనని తెలుపుతూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి బహిరం గ లేఖ పంపారు. సెప్టెంబర్ 17న ప్రతిపాదిత ప్రజాపాలన దినోత్సవానికి ఆహ్వానించడంపై కిషన్‌రెడ్డి స్పందిస్తూ సీఎం రేవంత్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.

నిజాం రజాకార్ల కిరాతక పాలన నుంచి స్వాతంత్య్రం పొందేందుకు ఏళ్ల తరబడి పోరాడిన విధానం, రజాకార్ల హింసకు వేల మంది ప్రాణాలు కోల్పోయిన విషయం మీకు తెలుసని గుర్తు చేశారు. వీరుల త్యాగాలను స్మరించుకుంటూ విమోచన చరిత్రను భవిష్యత్ తరాలకు తెలియ జేయాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని పేర్కొన్నారు. ఇంతటి స్ఫూర్తిదాయకమైన విమోచన దినోత్సవాన్ని పేరు మార్చడం వాస్తవ చరిత్ర నుంచి ప్రజల దృష్టి మరల్చడమే అవుతుందని స్పష్టం చేశారు. సెప్టెంబర్ 17న తేదీన తెలంగాణ వీరుల త్యాగాలను స్మరించుకునేలా విమోచన దినోత్సవాన్ని ప్రధాని మోడీ అధికారికంగా నిర్వహిస్తున్నారని తెలిపారు. 

విమోచన దినోత్సవంగా ఎందుకు జరపరు?

  1. రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ప్రశ్న
  2. పరేడ్ గ్రౌండ్‌లో ఫొటో ఎగ్జిబిషన్ ప్రారంభం 

హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 15 (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం సెప్టెంబర్ 17వ తేదీని తెలంగాణ విమోచన దినోత్సవం గా ఎందుకు జరపడం లేదని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. గతేడాది మాదిరిగానే ఈసారి కూడా ప్రధాని మోదీ ఆదేశాలు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సూచనల మేరకు కేంద్ర పర్యాటక, సాం స్కృతిక శాఖ ఆధ్వర్యంలో కేంద్ర హోంశాఖ భాగమై తెలంగాణ విమోచన దినోత్సవాలు నిర్వహిస్తోందని అన్నారు.

సెప్టెంబర్ 17ను పురస్కరించుకొని  సికింద్రాబాద్‌లోని పరేడ్ మైదానంలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ (సీబీసీ) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తెలంగాణ సాయుధ పోరాటం, ఆపరేషన్ పోలో ఫొటో ఎగ్జిబిషన్‌ను సంజయ్ ఆదివా రం ప్రారంభించారు. రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్‌తో పాటు పలువురు నేతలతో కలిసి ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం పేరుతో కాంగ్రెస్ పార్టీ ప్రజలను వంచిస్తోందని, 50 ఏళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రజలను వంచించినందున ‘తెలంగాణ ప్రజా వంచన దినోత్సవాన్ని’ నిర్వహించుకోవాలని ఎద్దేవా చేశారు.

విమోచన దినోత్సవం పేరుతో నిర్వహిస్తే తాను కూడా ప్రభుత్వ కార్యక్రమానికి హాజరవుతానని తెలిపారు. తెలంగాణ ప్రజల ను రాచిరంపాన పెట్టిన రజకార్ల పార్టీ వారసులకు కాంగ్రెస్ పార్టీ వత్తాసు పలకడం సిగ్గు చేటని మండిపడ్డారు. ఫొటో ఎగ్జిబిషన్ ద్వారా నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా తెలంగాణ విముక్తి కోసం చేసిన పోరాటాలు, సమరయోధుల త్యాగాలను కళ్లకు కట్టినట్లుగా చూపారని ప్రశంసించారు. రజాకార్ల దారుణా లు అన్నీ ఇన్నీ కావని..

బైరాన్‌పల్లి, గుండ్రాంపల్లి, పరకాల, వెయ్యి ఊడలమర్రి సంఘట నలు ఇంకా కళ్ల ముందు మెదులుతున్నాయని పేర్కొన్నారు. నగ్నంగా మహిళలను బతుకమ్మ ఆడించిన దురాగతాలు మరువలేమని అన్నారు. ఒకవైపు రాహుల్ గాంధీ అమెరికాకు వెళ్లి భారతదేశాన్ని కించపరిచేలా మాట్లాడుతుంటే.. రాష్ట్రంలో జై పాలస్తీనా అనే ఒవైసీకి సీఎం వత్తాసు పలికి తెలంగాణను కించపరుస్తున్నాడంటూ సంజయ్ నిప్పులు చెరిగారు. 

భవిష్యత్‌లోనైనా వాస్తవాలను అర్థం చేసుకుని చరిత్రాత్మకమైన రోజును తెలంగాణ విమోచన దినోత్సవంగా గుర్తిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

ఓవైసీలకు ప్రభుత్వం భయపడుతున్నది

  1. అందుకే విమోచన దినోత్సవం జరపడం లేదు
  2. సీఎం రేవంత్‌రెడ్డికి బీజేఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డి లేఖ

హైదరాబాద్, సెప్టెంబర్ 15 (విజయక్రాంతి): ఓవైసీలకు భయపడే రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 17ను విమో చన దినోత్సవంగా నిర్వహించడం లేదని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినోత్సవంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తూ సీఎం రేవంత్‌రెడ్డికి మహేశ్వర్‌రెడ్డి బహిరంగ లేఖ పంపారు. గతంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం కూడా ఓవైసీలకు భయపడ్డదని విమర్శించారు. బీఆర్‌ఎస్ సర్కార్‌లో ఉన్నప్పుడు సమైక్యత దినోత్సవం అంద ని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన దినోత్సవం అం టోందని ఎద్దేవా చేశారు.

బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఇష్టారీతిన పేర్లు మార్చుతూ తెలంగాణ సాయుధ పోరాట యోధుల త్యాగాలను విస్మరిస్తున్నాయని మండిపడ్డారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం రజాకార్ల అరాచక పాలనకు వ్యతిరేకంగా ఉద్యమం చేసిన అమరుల త్యాగాలను గౌరవించి, ప్రజాపాలన దినోత్సవం పేరు కాకుండా తెలంగా ణ విమోచన దినోత్సవంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ప్రజలు రేవంత్ సర్కార్‌కు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఈసారి కూడా రాష్ట్రంలో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు. 

ప్రజాపాలన దినోత్సవం రాజ్యాంగబద్ధం కాదు

  1. సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినమే
  2. బీజేపీ నాయకులు వెంకటేశ్వర్లు, ప్రకాశ్‌రెడ్డి

హైదరాబాద్, సెప్టెంబర్ 15 (విజ యక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన పేరుతో సెప్టెంబర్ 17న ఉత్స వాలను నిర్వహించడం రాజ్యాంగబద్ధమైనది కాదని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు, కార్యదర్శి ఎస్.ప్రకాశ్‌రెడ్డి అన్నారు. ఆదివా రం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మీడి యా సమావేశంలో వారు మాట్లాడారు. తెలంగాణ విమోచన దినోత్స వం జరపాలని బీజేపీ అనేక పోరాటా లు చేసిందని గుర్తు చేశారు.

మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో మాదిరిగానే తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని డి మాండ్ చేశారు. తెలంగాణ విమోచ నం కోసం జరిగిన పోరాటాలను తక్క వ చేసి చూపించడంలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు పోటీ పడి మరీ వక్రభాష్యాలు చెబుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. సెప్టెంబర్ 17 ముమ్మాటికీ తెలంగాణ విమోచన దినమేనని, ప్రజాపాలన పేరుతో ప్రజలను మాయ చేయవద్దని సూచించారు.

చరిత్రను రేవంత్ వక్రీకరిస్తున్నరు  

బీఆర్‌ఎస్ నేత దాసోజు 

హైదరాబాద్, సెప్టెంబర్ 15(విజయక్రాంతి): సెప్టెంబర్ 17వ తేదీని ప్రజాపాలన దినోత్సవంగా జరపాల ని ఇటీవల తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించడంపై బీఆర్‌ఎస్ సీనియర్ నేత దాసోజు శ్రావణ్ అనుమానం వ్యక్తం చేశారు. ఆదివారం ఆయన తెలంగాణ ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. 1948, సెప్టెంబర్ 17వ తేదీ అనేది చారిత్రకమైన దినం అని అన్నారు. దీన్ని ఒక్కో రాజకీయ పార్టీ ఒక్కో విధంగా  అర్థం చేసుకుంటున్నాయని చెప్పారు.

చరిత్రను రేవంత్ రెడ్డి వక్రీకరించి రాజకీయం చేస్తున్నారని ఆగ్ర హం వ్యక్తం చేశారు. చారిత్రాత్మక రోజును ప్రజాపాలన దినంగా మార్చడంపై అభ్యంతరం తెలిపారు. రేవంత్ రెడ్డి ఆలోచన ధోరణి బీజీపీ భావజాలాన్ని బలపర్చే విధంగా ఉందని అభి ప్రాయపడ్డారు. అందుకే దీనికి అమిత్ షా, బండి సంజయ్ వంటి నేతలను ఆహ్వానించారని ఆయన పేర్కొన్నారు. భవిష్యత్‌లో సీఎం రేవంత్ రెడ్డి వారి తో కలుస్తాడన్న దానికి ఇవే సంకేతాలని ఆయన చెప్పారు.

సెప్టెంబర్ 17పై బీజేపీ తొండి 

తెలంగాణ సాయుధ పోరాటంతో బీజేపీ కి ఎలాంటి సంబంధం లేదు. సెప్టెంబర్ 17 పై ఆ పార్టీ ఏదేదో ప్రకటనలు చేస్తూ పబ్బం గడుపుకోవాలని చూస్తోంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుతో కూడా బీజేపీకి ఎలాంటి సంబంధం లేదు. 

 మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి