calender_icon.png 16 January, 2025 | 6:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విభజన సమస్యలను పరిష్కరించుకోవాలి

07-07-2024 12:23:59 AM

రెండు రాష్ట్రాల సీఎంల భేటీపై బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ డాక్టర్ లక్ష్మణ్

హైదరాబాద్, జూలై 6 (విజయక్రాంతి): రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్‌రెడ్డి సానకూల వాతావరణంలో విభజన సమస్యలను పరిష్కరించుకోవాలని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ డాక్టర్ కె.లక్ష్మణ్ ఆకాంక్షించారు. జన సంఫ్‌ు వ్యవస్థాపకుడు డాక్టర్ శ్యాం ప్రసాద్ ముఖర్జీ జయంతి సందర్భంగా శనివారం హైదరాబాద్‌లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో వేడుక నిర్వహించారు. శ్యాం ప్రసాద్ చిత్రపటానికి డాక్టర్ లక్ష్మణ్ నివాళి అర్పించి అనంతరం మీడియాతో మాట్లాడారు.

కశ్మీర్‌కు ప్రత్యేక అధికారాలు, స్వయం ప్రతిపత్తిని తీవ్రంగా వ్యతిరేకించి, ఆర్టికల్ 370 రద్దు కోసం ఉద్యమించిన గొప్ప దేశభక్తుడు శ్యాం ప్రసాద్ ముఖర్జీ అని కొనియాడారు. దేశ సమగ్రత కోసమే శ్యాం ప్రసాద్ ముఖర్జీ ప్రాణత్యాగంం చేశారన్నారు. కేంద్ర ప్రభుత్వం తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. రాజకీయాలనేవి కేవలం ఎన్నికల వరకేనని, రాష్ట్రాల అభివృద్ధిపై ప్రధాని మోదీకి ప్రత్యేక విజన్ ఉందని తేల్చిచెప్పారు. తిరుమల తిరుపతి దేవస్థాన పవిత్రతను కాపాడాలని ఇప్పటికే తాను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు బహిరంగ లేఖ రాశానని గుర్తుచేశారు. కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించారు. బీజేపీ ముస్లింలకు వ్యతిరేకమని ఆ పార్టీ విష ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. బీజేపీ మతపరమైన రిజర్వేషన్లను వ్యతిరేకిస్తోందని స్పష్టం చేశారు.