ఏ కుటుంబంలో అయిన భార్యాభర్త గొడవలు సహజం. గొడవలు లేని కుటుంబం అందం ఉంటుంది. కానీ భార్యాభర్తల మధ్య గొడవలు జరిగితే ఆ కుటుంబం అద్భుతంగా ఉంటుందని అంటున్నారు నిపుణులు. ప్రస్తుతం చిన్న విషయాలకు భావోద్వేగానికి గురై.. విడాకుల వరకు వెళ్తున్నారు. అలాకాకుండా బంధం దృఢంగా.. మరింత ఆనందంగా ఉండాలంటే విడాకుల్లో కొత్త ట్రెండ్ వచ్చేసింది. అదే విడిపోయి కలిసుండే ‘ట్రయల్ సపరేషన్’ పద్ధతి. దీని కారణంగా భాగస్వాముల్లో మనసు మారితే ఆ బంధం మరింత బలపడుతుందని నిపుణులు చెబుతున్నారు. పరస్పరం విడిపోయి ఇద్దరూ ఒంటరిగా ఉండటం కారణంగా భార్య గురించిన ఆలోచనలతో భర్త, భర్త గురించిన ఆలోచనలతో భార్య మనసు నిండిపోతుంది.
ఈ సందర్భంగా అసలు తాము ఎందుకు విడిపోవాలనుకుంటున్నారు? అంత తీవ్రమైన సమస్యలున్నాయా? పరిష్కరించుకోలేనివా? అనే ఆలోచనలు వస్తాయని, దీంతో రియలైజ్ అవుతారని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా ఒకరిపట్ల ఒకరికి కోపం తగ్గడం సానుకూల భావన ఏర్పడం వంటి కారణాలతో తిరిగి కలిసిపోవాలనే ఆలోచన వస్తుంది. ఫలితంగా విడాకుల నిర్ణయం వెనక్కి తీసుకుందామనుకునే చాన్స్ ఉంటుంది. పైగా దూరం పెరగడం వల్ల వచ్చిన మార్పు తర్వాత కలిసిపోయిన భాగస్వాముల బంధం మరింత బలపడుతుందని నిపుణులు చెబుతున్నారు.