calender_icon.png 19 April, 2025 | 7:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సన్నబియ్యం దొడ్డు బియ్యానికి వేరువేరుగా వరి కొనుగోలు కేంద్రాలు

11-04-2025 12:01:03 AM

నాగర్ కర్నూల్ ఏప్రిల్ 10 ( విజయక్రాంతి ) రబీ సీజన్ వరి కొనుగోలు కేంద్రా లను సన్నబియ్యం, దొడ్డు బియ్యానికి వేరువేరుగా సిద్ధం చేసినట్లు జిల్లా కలెక్టర్ బాధా వత్ సంతోష్ తెలిపారు. గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయాల సమావేశ మందిరంలోరబీ 202425  వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల అవగాహన సదస్సులో పంట ధాన్యం కొనుగోళ్ళకు సంబంధించి అదనపు కలెక్టర్ అమరేందర్, ఆయా శాఖల అధికారుల,రైస్ మిల్లర్లతో, కలిసి జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్, సమీక్ష సమావేశం నిర్వహించారు.

రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ ఏడాది రబీ సీజన్ వరి ధాన్యం కొనుగోలుకు పగడ్బందీ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా రబీలో 2,87,297, మెట్రిక్ టన్నుల వరి ధాన్యం అంచనా చేయగా ఐకెపి సెంటర్లు 70, మెప్మా సెంటర్లు 4, ప్రాథమిక సహకార సంఘాలు ద్వారా 160 మొత్తంగా సన్న బియ్యం దొడ్డు బియ్యం కోసం వేర్వేరుగా 234 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.