calender_icon.png 15 November, 2024 | 9:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సియోల్ స్ఫూర్తితోనే యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ

10-11-2024 03:14:40 PM

స్టేట్ లెవెల్ స్పోర్ట్స్ కు హుస్నాబాద్ వేదిక కావాలి

ఆ స్థాయిలో స్టేడియాన్ని డెవలప్ చేస్తాం

రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

హుస్నాబాద్ (విజయక్రాంతి): సియోల్ లో స్పోర్ట్స్ యూనివర్శిటీని చూసిన తరువాత స్ఫూర్తి పొందే రాష్ట్రంలో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నామని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆదివారం ఆయన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లోని ఇండోర్ స్టేడియంలో అండర్-14 విభాగంలో జరిగిన ఎస్జీఎఫ్ స్టేట్ లెవెల్ హ్యాండ్ బాల్ 68వ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. పోటీల్లో గెలుపొందిన ఆదిలాబాద్, వరంగల్ గర్ల్స్, కరీంనగర్, వరంగల్ బాయ్స్ జట్లకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సియోల్ లో క్రీడా విధానాన్ని చూసి, రాష్ట్రంలో క్రీడల అభివృద్ధి కోసం ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు తెలిపారు. అందులో భాగంగానే యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు.

ఆ యూనివర్సిటీలో హుస్నాబాద్ నుంచి అధిక సంఖ్యలో అడ్మిషన్లు పొందాలన్నారు. ఇందుకోసం క్రీడా ఉపాధ్యాయులు విద్యార్థులకు తగిన శిక్షణ ఇవ్వాలని సూచించారు. స్టేట్ లెవెల్ స్పోర్ట్స్ కు హుస్నాబాద్ వేదిక కావాలని, ఆ స్థాయిలో ఇక్కడి స్టేడియాన్ని డెవలప్ చేస్తామన్నారు.  హుస్నాబాద్ లో మొదటిసారిగా రాష్ట్ర స్థాయి హ్యాండ్ బాల్ పోటీలు జరగడం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్ర స్థాయి క్రీడలకు హుస్నాబాద్ ను వేదికగా తయారు చేస్తామన్నారు. అందుకోసం ఇక్కడి స్టేడియాన్ని డెవలప్ చేస్తామన్నారు. అథ్లెటిక్స్, వ్యాయామం, కబడ్డీ తదితర పోటీల్లో శిక్షణ ఇప్పిస్తామన్నారు. ఇక్కడ స్విమ్మింగ్ పూల్ కూడా నిర్మిస్తామని, షటిల్ కోర్టులో సింథటిక్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. స్టేడియంలో డ్రెస్సింగ్ రూమ్, టాయిలెట్స్ కంప్లీట్ చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ ఆకుల రజిత, ఎంఈవో మనీల, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేడం లింగమూర్తి, సింగిల్ విండో చైర్మన్ శివయ్య, మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ అనిత తదితరులు పాల్గొన్నారు.