- కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్ కేసులపైనా విచారణ
- విద్యుత్ కమిషన్ నివేదికపై న్యాయ సలహాకు..
- భూదాన్, దేవాదాయ, అసైన్డ్ భూముల అక్రమాలపై ఫోరెన్సిక్ ఆడిట్
- ఒక్క సిరిసిల్లలోనే 2 వేల ఎకరాలు అన్యాక్రాంతం
- రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
హైదరాబాద్, జనవరి 7(విజయక్రాంతి): మాజీ మంత్రి కేటీఆర్‌కు సం బంధించి ఏసీబీ, ఈడీ కేసులపై రెవె న్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి స్పందించారు. సియోల్ బాంబు లు పేలడం కొంత ఆలస్యమైనా ఇప్పు డు పేలడం మొదలయిందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
తప్పులు ఎప్పటికైనా బయటపడుతాయని, తప్పులు ఒప్పులు తేల్చేది కోర్టులేనని, తప్పు చేసిన వారు ఎప్పటికీ తప్పించుకోలేరని అన్నారు. మంగళవారం పొంగు లేటి సచివాలయంలో తన చాంబర్‌లో మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. విద్యుత్ కమిషన్ నివేదిక వచ్చిందని, ఆ నివేదికపై ప్రభుత్వం లీగల్ ఒపినియన్ తీసుకుంటుందని చెప్పారు.
కాళే శ్వరం ప్రాజెక్టుపై వేసిన కమిషన్‌కు సంబంధించి బహిరంగ విచారణ కొనసాగుతోందని, ఫోన్ ట్యాపింగ్ కేసు ఇంకా పూర్తికాలేదని, కొనసాగుతుందని పేర్కొన్నారు. ఖమ్మం జిల్లాకు చెం దిన మాజీ మంత్రి పువ్వాడ అజయ్.. తనకు ఇప్పటివరకు ఎదురుపడలేదన్నారు. జైలుకు వెళ్లితేనే సీఎం అవు తానని కేటీఆర్ అనుకుంటే.. కవితనే ముందు వెళ్లిందన్నారు. కేసీఆర్ సీఎం గా ఉన్నప్పుడు దేశం గురించి తప్ప తెలంగాణ గురించి మాట్లాడలేదని గుర్తుచేశారు.
భూ భారతి బిల్లు గవర్నర్ వద్ద ఉంది
ప్రభుత్వం ఆమోదించిన భూ భార తి చట్టం బిల్లు గవర్నర్ వద్ద ఉందని మంత్రి తెలిపారు. గవర్నర్ నుంచి అనుమతి రాగానే గెజిట్ విడుదల అవుతుందని చెప్పారు. చట్టానికి సంబంధించి రూల్స్ ప్రేమ్ చేయడానికి రెండు నెలల సమయం పడుతుందని వివరించారు. సంక్రాంతి తర్వాత భూ రికార్డులను ఫోరెన్సిక్ ఆడిట్ కోసం ప్రైవేట్ సంస్థలకు ఇవ్వబోతున్నట్టు చెప్పారు.
భూదాన్, దేవాదాయ, అసైన్డ్ భూముల్లో జరిగిన కుంభకోణాలన్నీ ఫోరెన్సిక్ ఆడిట్‌లో బయటపడుతాయన్నారు. ఒక్క సిరిసిల్లలోనే 2 వేల ఎకరాల ప్రభుత్వ భూమి అన్యాక్రాంతమైందని ఆరోపించారు. రంగారెడ్డి, మెదక్, మేడ్చల్ జిల్లాల్లోని భూబాగోతాలు ఫోరెన్సిక్ ఆడిట్ తర్వాత బయటపడతాయని పేర్కొన్నారు.
తప్పు చేయకపోతే కోర్టుకు ఎందుకెళ్లారు?
తప్పు చేయకపోతే కేటీఆర్ కోర్టుకు ఎందుకు వెళ్లారో చెప్పాలని మంత్రి నిలదీశారు. కోర్టులు, వ్యవస్థల ముందు బలప్రద ర్శన చేయడం సరికాదని హితవు పలికారు. తమ ప్రభుత్వం ఎవరిని టార్గెట్ చేయడం లేదని చెప్పారు. కొత్త సంవత్సరంలో కేటీఆర్‌లో స్పిరిట్ పెరిగిందని ఎద్దేవాచేశారు. కాంగ్రెస్ పార్టీకి బాండ్స్ ఎందుకు ఇచ్చారో అప్పుడు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్సే చెప్పాలన్నారు.
బాండ్స్ మాత్రమే కాదు.. ఇంకా బయటపడాల్సినవి చాలా ఉన్నాయని అన్నారు. జాతీయ పార్టీలకు లేని నిధులు ప్రాంతీయ పార్టీలకు ఎలా వచ్చాయని అడిగారు. విదేశీ కంపెనీకి వెళ్లిన డబ్బులు ఎవరి ఖాతాకు వెళ్లాయో తేలాలని అన్నారు. ప్రాం తీయ పార్టీల్లో బీఆర్‌ఎస్సే రిచెస్ట్ పార్టీ అని చెప్పారు. కేసీఆర్ ఏ కేసులో ఉన్నా.. హరీశ్‌రావు అక్కడ ఉంటారని అన్నారు.
అయితే కాంగ్రెస్ ప్రభుత్వానికి, సీఎం రేవంత్‌రెడ్డికి కేసీఆర్ కుటుంబాన్ని టార్గెట్ చేసే ఆలోచన లేదని స్పష్టంచేశారు. ఏది బయటపడినా అందులో ఆ కుటుంబ పాత్ర ఉంటుందని చెప్పారు. ఇప్పటీ వరకు వేసిన కేసులు, విచారణ కమిషన్లు బీఆర్‌ఎస్ వాళ్లు అడిగితేనే వేశామని చెప్పారు.
కాళేశ్వరం, విద్యుత్, ఫార్ములా ఈ విచారణ చేయాలని బీఆర్‌ఎస్ వాళ్లే అడిగారని పొంగులేటి గుర్తుచేశారు. అధికారంలో ఉన్నప్పుడు తప్పులు చేశారు కాబట్టే అన్ని బయటకు వస్తున్నాయని తెలిపారు. అరవింద్‌కుమార్ నిజాలు చెప్తే మరిన్ని బయటకు వస్తాయన్నారు.