న్యూఢిల్లీ: ఐటీఎఫ్ జె-300 టోర్నీలో సెంథిల్ కుమార్, మాయా రాజేశ్వరన్ సెమీస్‌కు దూసుకెళ్లారు. గురువారం జరిగిన బాలుర క్వార్టర్ ఫైనల్లో సెంథిల్ 6-3, 3-6, 6-4తో సమర్థ్‌పై విజయం సాధించాడు. ప్రస్తుతం సెంథిల్ 36వ ర్యాంకులో కొనసాగుతున్నాడు. మరో క్వార్టర్స్‌లో కొరియాకు చెందిన డోంగ్‌యున్ హాంగ్ భారత్‌కు చెందిన అర్నవ్ పపార్కర్‌ను ఓడించాడు. ఇక సెమీస్‌లో సెంథిల్, హాంగ్ తలపడనున్నారు. బాలికల సింగిల్స్‌లో మాయా రాజేశ్వరన్ 7-5, 6-0తో సెర్బియాకు చెందిన రాడా జొలొరెవాను ఓడించి సెమీస్‌లో అడుగుపెట్టింది.