calender_icon.png 1 January, 2025 | 7:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తేడా వస్తే ఊరుకోం అంటూ..

29-12-2024 09:36:27 PM

చిరు ఫ్యాన్స్ లెటర్స్ పంపారు! 

హిట్లర్’ చిత్రానికి మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో ప్రత్యేక స్థానం ఉంటుంది. ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రంలోని చెల్లెళ్ల సెంటిమెంట్‌కు కంటతడి పెట్టని ప్రేక్షకులు ఉండరు. అలాంటి చిత్రం నూతన సంవత్సరం కానుకగా జనవరి 1న రీరిలీజ్ అవుతోంది. దీనితో చిత్ర యూనిట్ రీరిలీజ్‌కు ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు డైరెక్టర్ మోహన్ రాజా, యువ హీరో సత్యదేవ్ అతిథులుగా హాజరయ్యారు. దర్శకుడు ముత్యాల సుబ్బయ్య, సంగీత దర్శకుడు కోటి, కమెడియన్ బాబుమోహన్, ఎడిటర్ మోహన్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు ముత్యాల సుబ్బయ్య మాట్లాడుతూ.. హిట్లర్’ సినిమా ప్రారంభానికి ముందే కొందరు ఫ్యాన్స్ నాకు లెటర్స్ రాశారు. సినిమా బాగా రావాలి.. ఏమైనా తేడా వస్తే ఊరుకోం అంటూ లెటర్స్ పంపారు. దేవుడా ఇదెక్కడి గొడవ అని అనుకున్నా’’ అని సుబ్బయ్య సరదాగా తెలిపారు. బాబు మోహన్ మాట్లాడుతూ.. హిట్లర్’ రీ రిలీజ్ అవుతున్నట్లు లేదు.. ఇప్పుడే ఫస్ట్ రిలీజ్ అవుతున్నట్టుగా ఉందీ హంగామా’’ అని చెప్పారు. హీరో సత్యదేవ్ మాట్లాడుతూ.. నేను గెస్టుగా రాలేదు.. ఫ్యాన్ బాయ్‌గా వచ్చాను అని తెలిపారు. నా చిన్నప్పుడు హిట్లర్’ చిత్రానికి మా అమ్మానాన్న నన్ను తీసుకెళ్లారు. ఇప్పుడు రీ రిలీజ్ అవుతుంది కాబట్టి వాళ్లిద్దరిని నేను సినిమాకు తీసుకెళతా’ అని తెలిపారు.