calender_icon.png 17 January, 2025 | 1:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బలవంతంగా పంపించేశారు

10-08-2024 03:48:23 AM

రిటైర్మెంట్ ప్రకటించిన స్విమ్మర్

పారిస్: అందం అనేది ఎవరికైనా ప్రత్యేక ఆకర్షణను తీసుకొస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఆ అందమే ఇప్పుడు ఒలింపిక్స్‌లో ఒక స్విమ్మర్‌కు కొత్త తంటాలు తెచ్చిపెట్టింది. విషయంలోకి వెళితే.. పరాగ్వే స్విమ్మర్ లువానా అలోన్సో ఈసారి ఒలింపిక్స్‌లో 100 మీటర్ల మహిళల బటర్‌ఫ్లు పోటీల్లో పాల్గొని ఓటమిపాలైంది. తృటిలో సెమీస్‌కు వెళ్లే అవకాశాన్ని కోల్పోయింది. కానీ క్రీడలు ముగిసే వరకు వరకు ఒలింపిక్ విలేజ్‌లోనే ఉండాలని లువానా నిర్ణయించుకుంది.

అందుకు తగ్గట్లే  సదరు దేశ ఒలింపిక్ బృందం కూడా ఏర్పాట్లు చేసింది. ఆ తర్వాత లువానా అందాలు చూసి.. ఆ దేశ క్రీడాకారులు తమ ఏకాగ్రతను కోల్పోతున్నారన్న కారణంతో ఆమెను బలవంతంగా స్వదేశానికి పంపించేశారు. స్వదేశానికి వెళ్లిన లువానా అనూహ్యంగా స్విమ్మింగ్‌కు రిటైర్మెంట్ ప్రకటించి షాక్ ఇచ్చింది. తనకు మద్దతుగా నిలిచిన దేశ ప్రజలకు ధన్యవాదాలు తెలిపింది.