calender_icon.png 13 January, 2025 | 3:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సెన్సెక్స్ 759 పాయింట్ల రికవరీ

30-11-2024 12:00:00 AM

ఐటీ, ఆటో షేర్లలో అమ్మకాలు

ముంబై, నవంబర్ 29: దేశీయ స్టాక్ మార్కెట్ గురువారంనాటి తీవ్ర నష్టాల నుంచి శుక్రవారం కొంతమేర కోలుకున్నది. హెవీవెయిట్ షేర్లు భారతి ఎయిర్‌టెల్,  రిలయన్స్ ఇండస్ట్రీస్ అండతో  బీఎస్‌ఈ సెన్సెక్స్ 759 పాయింట్లు పెరిగి 79,802 పాయింట్ల వద్ద నిలిచింది.

ఇదేబాటలో ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 217 పాయింట్లు పెరిగి 24,31  పాయింట్ల వద్ద ముగిసింది. క్రితం రోజు సెన్సెక్స్ 1,200 పాయింట్లు, నిఫ్టీ 360 పాయింట్ల చొప్పున పతనమైన సంగతి తెలిసిందే. ఈ వారం మొత్తంమీద సెన్సెక్స్ 685, నిఫ్టీ 223పాయింట్ల చొప్పున లాభపడ్డాయి. 

ఎయిర్‌టెల్ టాప్ గెయినర్

సెన్సెక్‌ేొ్స30 బాస్కెట్‌లో అన్నింటికంటే అధికంగా భారతి ఎయిర్‌టెల్ షేరు 5 శాతం ర్యాలీ జరిపింది. మహీంద్రా అండ్ మహీంద్రా, అల్ట్రాటెక్ సిమెంట్, అదానీ పోర్ట్స్, రిలయన్స్ ఇండస్ట్రీస్, లార్సన్ అండ్ టుబ్రో, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, హిందుస్థాన్ యూనీలివర్, టైటాన్, టాటా మోటార్స్ 2.5 శాతం వరకూ పెరిగాయి.

మరోవైపు పవర్‌గ్రిడ్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇన్ఫోసిస్‌లు నష్టాలతో ముగిసాయి. అదానీ గ్రూప్‌నకు చెందిన మెజారిటీ కంపెనీలు లాభపడగా, అదానీ గ్రీన్ ఎనర్జీ అధికంగా 22 శాతం, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ 15.56 శాతం చొప్పున జంప్ చేశాయి. 

కొనసాగిన ఎఫ్‌పీఐల విక్రయాలు

విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్‌పీఐలు) విక్రయాలు యథావిధిగా కొనసాగాయి. శుక్రవారం విదేశీ ఇన్వెస్టర్లు రూ. 4,383 కోట్ల నిధుల్ని మార్కెట్ నుంచి వెనక్కు తీసుకున్నట్లు స్టాక్ ఎక్సేంజీల తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. విదేశీ ఫండ్స్ గురువారం రూ. 11,700 కోట్ల విలువైన షేర్లను నికరంగా విక్రయించారు.