* లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు
* రాణించిన బ్యాంకింగ్ షేర్లు
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల పవనాలతో మార్కెట్లు లాభపడ్డాయి. క్రితం సెషన్‌తో పోలిస్తే సెన్సెక్స్ లాభాలల్లో 76,978.53 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. ప్రారంభంలోనే సెన్సెక్స్ 300 పాయింట్లకుపైగా పెరి గింది. చివరి వరకు అదే ఊపును కొనసాగించాయి. ఇంట్రాడేలో 76,584.84 పాయిం ట్ల కనిష్ఠాన్ని తాకిన సెన్సెక్స్.. 77,318.94 పాయింట్ల గరిష్ఠానికి చేరింది. చివరకు 454.11 పాయింట్ల లాభంతో.. 77,073.44 వద్ద స్థిరపడింది.
నిఫ్టీ సైతం 141.55 పెరిగి.. 23,344.75 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో దాదాపు 2,399 షేర్లు లాభపడ్డాయి. మరో 1,492 షేర్లు నష్టపోయాయి. నిఫ్టీలో కోటక్ మహీంద్రా బ్యాంక్, విప్రో, బజాజ్ ఫైనాన్స్, ఎన్టీపీసీ, బజాజ్ ఫిన్‌సర్వ్ లాభపడ్డాయి. ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, శ్రీరామ్ ఫైనాన్స్, ట్రెంట్, హెచ్డీఎఫ్‌సీ లైఫ్, అదానీ పోర్ట్స్‌నష్టపోయాయి.
ఆటో, ఎఫ్‌ఎంసీజీ మినహా ఇత ర అన్ని సూచీలు బ్యాంక్, మీడియా, మెటల్, క్యాపిటల్ గూడ్స్, పీఎస్యూ, టెలికాం, పవర్, పీఎస్యూ బ్యాంక్ సూచీలు ఒకటి నుంచి రెండుశాతం వరకు పెరిగాయి. బీఎస్‌ఈ మిడ్‌క్య్యాప్ ఇండెక్స్ 0.66 శాతం పెరిగింది. స్మాల్ క్యాప్ ఇండెక్స్ దాదాపు ఒకశాతం పైకి కదిలింది.
బిట్‌కాయిన్ దూకుడు
మరో వైపు అమెఇకా అధ్యక్షుడిగా ట్రంప్ పగ్గాలు చేపట్టనున్న వేళ బిట్‌కాయిన్ మరింత దూసుకెళ్లింది. సోమవారం ఉద యం తొలిసారి 1,09,000 డాలర్ల మార్కు ను దాటింది. ఆతర్తావ కాస్త తగ్గి 1,07,000 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. క్రిప్టో కరెన్సీకి ట్రంప్ అనుకూలంగా ఉండడం బిట్‌కాయిన్ ర్యాలీకి కారణమని విశ్లేషకులు చెబుతున్నా రు. రెండేళ్ల క్రితం బిట్‌కాయిన్ విలువ 20 వేల డాలర్లు మాత్రమే ఉండేది.