calender_icon.png 10 January, 2025 | 2:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సెన్సెక్స్ మరో 318 పాయింట్లు డౌన్

17-10-2024 12:41:02 AM

25,000 దిగువకు నిఫ్టీ

ఐటీ, ఆటో షేర్లలో అమ్మకాలు

ముంబై, అక్టోబర్ 16: ఐటీ, ఆటో షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తడంతో మార్కె ట్ వరుసగా రెండోరోజూ క్షీణించింది. అంతర్జాతీయ సంకేతాలు బలహీనంగా ఉండటం, విదేశీ ఇన్వెస్టర్లు అదేపనిగా అ మ్మకాలు జరపడంతో బుధవారం ఇంట్రాడేలో 462 పాయింట్ల వరకూ తగ్గిన బీఎస్‌ఈ సెన్సెక్స్ 81,358 పాయింట్ల కనిష్ఠస్థాయిని తాకిన అనంతరం చివరకు 318 పాయింట్ల తగ్గుదలతో  81,501 పాయింట్ల వద్ద నిలిచింది.

ఇదేబాటలో  ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ  86 పాయింట్ల నష్టంతో  కీలకమైన 25,000  పాయింట్ల దిగువన 24, 972 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. కార్పొరేట్ల క్యూ2 ఫలితాలు నిరుత్సాహకరంగా ఉంటున్నదున, డౌన్‌గ్రేడ్లు జరుగుతాయన్న భయా లతో ఇన్వెస్టర్లు  లాభాల స్వీకరణ జరిపారని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ చెప్పారు.

క్యూ1తో పోలిస్తే క్యూ2లో కార్పొరేట్ లాభా ల రికవరీ అంచనాలకంటే బలహీనంగా ఉన్నదని తెలిపారు. మంగళవారం యూఎస్ మార్కెట్ భారీగా తగ్గడం, బుధవారం ఆసియా, యూరప్ సూచీలు ప్రతికూలంగా ట్రేడ్‌కావడంతో వరుసగా రెండో రోజూ నిఫ్టీ పడిపోయిందని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ రిటైల్ రీసెర్చ్ హెడ్ దీపక్ జసాని వివరించారు. 

కొనసాగిన ఎఫ్‌పీఐల అమ్మకాలు

విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెసర్ల (ఎఫ్‌పీఐలు) విక్రయాలు బుధవారం సైతం కొనసాగాయి. తాజాగా ఎఫ్‌పీఐలు రూ.3,435 కోట్ల విలువైన షేర్లు విక్రయించినట్లు ్ట స్టాక్ ఎక్సేంజీల ప్రాధమిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. గత 11 ట్రేడింగ్ రోజుల్లో  దాదాపు రూ.65,000 కోట్లకుపైగా ఈక్విటీ పెట్టుబడుల్ని విదేశీ ఫండ్స్ వెనక్కు తీసుకున్నాయి. 

ఎం అండ్ ఎం టాప్ లూజర్

సెన్సెక్స్ బాస్కెట్‌లో అన్నింటికంటే అధికంగా మహీంద్రా అండ్ మహీం ద్రా 2.9 శాతం క్షీణించింది. ఇన్ఫోసిస్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, టెక్ మహీంద్రా, టాటా మోటార్స్, కోటక్ మహీంద్రా బ్యాంక్, అదానీ పోర్ట్స్, ఐటీపీ, టైటాన్‌లు 2 శాతం వరకూ తగ్గాయి. మరో వైపు భారతి ఎయర్‌టెల్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఏషియన్ పెయింట్స్, ఎస్బీఐలు 1 శాతం వరకూ లాభపడ్డాయి. వివిధ రంగాల సూచీల్లో అధికంగా ఐటీ సూచి 1.17 శాతం పడిపోయింది. ఆటోమొబైల్ ఇండెక్స్ 0.97 శాతం, టెక్నా లజీ ఇండెక్స్ 0.79 శాతం చొప్పున తగ్గాయి. టెలికమ్యూనికేషన్ ఇండెక్స్ 0.91 శాతం, రియల్టీ ఇండెక్స్ 0.64 శాతం మేర పెరిగాయి.