కోల్కతా: కోల్కతా(Kolkata) ట్రైనీ డాక్టర్ హత్యచార కేసులో సీల్దా కోర్టు(Sealdah Court) సంచలన తీర్పునిచ్చింది. హత్యాచార ఘటనలో సంజయ్ రాయ్ ను దోషిగా కోర్టు తేల్చింది. నిందితుడు సంజయ్ కు కోర్టు సోమవారం శిక్ష ఖరారు చేయనుంది. కాగా, గతేడాది ఆగస్టు 9న ఆర్జీ కర్ జూనియర్(RG Kar Junior College) వైద్యురాలిపై హత్యాచారం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టంచిన విషయం తెలిసిందే. ఆగస్టు 10న నిందితుడు సంజయ్ రాయ్ ను అరెస్టు చేసిన పోలీసులు, తాజాగా ఈ హత్యాచార కేసును సీబీఐ(CBI) విచారించింది. 120 మందికిపైగా సాక్షుల వాంగ్మూలాలను సేకరించిన సీబీఐ.. విచారించి నిందితుడు సంజయ్ కి లై డిటెక్టర్(Lie detector) పరీక్షను నిర్వహించింది. సీబీఐ ఆధారాల మేరకు సంజయ్ రాయ్ ను కోర్టు దోషిగా తేల్చింది. ఘటనస్థలిలో నిందితుడు వెంట్రుకలు, బ్లూటూత్ దొరికాయని సీబీఐ చెప్పింది.