19-03-2025 12:59:21 AM
కోర్టును తప్పుదోవ పట్టించినందుకు పిటిషనర్‌కు హైకోర్టు రూ. కోటి జరిమానా
హైదరాబాద్, మార్చి 18 (విజయక్రాంతి): కోర్టును తప్పుదోవ పట్టించిన పిటిషనర్‌కు రూ.కోటి జరిమానా విధి స్తూ మంగళవారం హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. తన భూమిని రిజిస్ట్రేష న్ చేయడం లేదంటూ వెంకట్రామిరెడ్డి అనే పిటిషనర్ హైకోర్టును ఆశ్రయించగా, పిటిషన్‌పై మంగళవారం జస్టిస్ నగేశ్ భీమపాక విచారణ చేపట్టారు.
రంగారెడ్డి జిల్లా బండ్లగూడ మండలం కందికల్ సర్వే నంబర్ 310/1, 310/2 పరిధిలో 9.11 ఎకరా ల భూమిని అధికారులు రిజిస్ట్రేషన్ చేయడం లేదని వెంక ట్రామిరెడ్డి హైకోర్టును ఆశ్రయించాడు. పిటిషనర్‌కు చెంది న సదరు భూములను రిజిస్ట్రేషన్ చేయొద్దంటూ బండ్లగూడ తహసీల్దార్ లేఖ రాశారని పిటిషనర్ తరఫున న్యాయవాది వేదుల వెంకటరమణ వాదించారు.
పిటిషనర్ తన భూమిని రిజిస్ట్రేషన్ చేసుకునేలా అధికారులకు ఉత్తర్వులు ఇవ్వాలని కో రారు. ప్రభుత్వం తరఫు న్యాయవాది వాది స్తూ.. పిటిషనర్ పేర్కొన్న సర్వే నంబర్లు కందికల్ పరిధిలో లేవని, ఆ గ్రామంలో సర్వే నంబర్ 309/5తో ముగుస్తుందని కోర్టు దృ ష్టికి తీసుకొచ్చారు. తప్పుడు పత్రాలు సృష్టిం చి పిటిషనర్ ప్రభుత్వ భూమిని కాజేసే కుట్ర చేస్తున్నారని వాదించారు.
సదరు భూమి కోసం గతంలోనూ పిటిషనర్ పిటిషనర్ తం డ్రి హైకోర్టును ఆశ్రయించి రెండు వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశాడని, తర్వాత వాటిని వాపస్ తీసుకున్నారని వివరించారు. ఈ పిటిషన్ల గురించి వెంకట్రామిరెడ్డి కనీసం అఫిడవిట్‌లో ప్రస్తావించకుండా, కోర్టును తప్పుదోవ పట్టిస్తున్నారని స్పష్టం చేశారు.
సదరు భూమి యాజమాన్య హక్కులపై ఇప్పటికే కోర్టుల్లో అనేక పిటిషన్లు దాఖలయ్యాయని వివరించారు. అనంతరం న్యా యమూర్తి స్పందిస్తూ.. పిటిషనర్ ఉద్దేశపూర్వకంగా కోర్టును తప్పుదోవ పట్టించేందుకు యత్నించాడని మండిపడ్డారు.
కోర్టు విలువైన సమయాన్ని వృథా చేసినందుకు గాను హైకోర్టు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రూ.కోటి జరిమానా విధించారు. ఏప్రిల్ 10లోపు జరిమానాను హైకోర్టు లీగల్ సర్వీస్ అథారిటీకి చెల్లించాలని, లేనిపక్షంలో పిటిషనర్‌ను న్యాయస్థానం ఎదుట హాజరుపరచాలని రిజిస్ట్రార్‌ను ఆదేశించారు.