21-03-2025 01:20:02 AM
భద్రాచలం, మార్చి 20 (విజయ క్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో హోలీ పౌర్ణమి సందర్భంగా ముందుగా జరగా ల్సిన ఈనెల 13న అంకురార్పణ ఆలస్యంగా జరగటంపై గురువారం భద్రాచలం దేవాలయంలో విచారణ చేపట్టిన దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు.
ఆలయ వైదిక కమిటీ మరియు ఆలయ అధికారులతో భద్రాచలంలో సమావేశమైన విచారణ బృందం.విజిలెన్స్ అధికారి, అడిషనల్ కమిషనర్ కృష్ణవేణి, మరియు వరంగల్ డిసి, హైదరాబాద్ డిసి సమక్షంలో సమావేశమైన ఆలయ వైదిక కమిటీ, ఆలయ అధికారులు. ముందుగా శ్రీ సీతారామచంద్ర స్వామివారి దర్శనానికి వచ్చిన అధికారులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం శ్రీ లక్ష్మి తాయారమ్మవారి ఆలయంలో వేద పండితుల చేత వేద ఆశీర్వచనం అందించి స్వామివారి జ్ఞాపికను లడ్డు ప్రసాదాలను అందజేశారు.విచారణ కు వచ్చిన ఉన్నతాధికారులు అర్చకులను, ఈఓ రమాదేవి నీ ఒకేచోట కూర్చోబెట్టి మాట్లాడగా ఇరువురి వాదనలు వినిపించారు.
ఇరు వర్గాల వారు చెప్పిన కారణాలను ఉన్నతాధికారులు పై స్థాయి అధికారులకు నివేదిక అందజేయనున్నారు.ఏప్రిల్ 6,7 తేదీలలో జరగనున్న శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని ఆలయంలో జరిగే వేడుకలకు భక్తుల నుంచి విశేష స్పందన ఉండేలా కృషి చేయాలని ఈ సందర్భంగా సూచించారు.