రామయంపేట: రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలోని కటికే శంకర్ అనారోగ్య కారణాలతో ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యం చేసుకుని ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకోగా ఎమ్మెల్యే రోహిత్ రావు సహకారంతో 54,000/- మంజూరయ్యాయి. కాంగ్రెస్ పార్టీ నాయకులు పిసిసి సభ్యులు చౌదరి సుప్రభాతారావు బాధితుడికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును గురువారం అందజేశారు. అనారోగ్య కారణాలతో ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్యం చేసుకున్న కటికే శంకర్ బాధితుడు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుకు దరఖాస్తు చేసుకోగా 54 వేలు మంజూరు అయ్యాయని పిసిసి సభ్యులు చౌదరి సుప్రభాత్ రావు తెలిపారు. మంజూరు అయిన చెక్కును కాంగ్రెస్ పార్టీ పీసీసీ సభ్యులు చౌదరి సుప్రభాత్రావు బాధితునికి అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు అల్లాడి వెంకట్, రేవెల్లి వినయ్ సాగర్ తదితరులు పాల్గొన్నారు.