calender_icon.png 27 December, 2024 | 1:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీనియర్ న్యాయవాది శంకరన్న మృతి

01-12-2024 08:56:42 PM

ఖమ్మం (విజయక్రాంతి): ఖమ్మం పట్టణానికి చెందిన ప్రముఖ సీనియర్ న్యాయవాది, హక్కుల నాయకుడు చల్లా శంకర్ ఆదివారం హఠాన్మరణం చెందారు. గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్‌తో ఆయన ఆదివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ట్యాబ్‌లెట్స్ కోసం మున్సిపల్ ఆఫీస్ వద్ద ఉన్న మెడికల్ షాపునకు వెళ్ళి కళ్లు తిరుగుతుండడంతో వెంటనే ఆటోలో ఇంటికి చేరుకున్నాక కుప్పకూలి చనిపోయాడు. ఆస్పత్రికి తీసుకువెళ్ళినప్పటికీ ప్రయోజనం లేకుండాపోయింది. ఆయనకు భార్య, ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. శంకరన్నగా పేరుగాంచిన ఆయన విప్లవ, ప్రజా హక్కుల ఉద్యమాల్లో కీలకపాత్ర పోషించారు. జీవించినంత కాలం ప్రజా ఉద్యమాల పట్ల ప్రేమతో ముందుకు సాగారు. విప్లవ కార్యకర్తలకు ఆయన ఇల్లు నిలయంగా ఉండేది. ఆయన అకాల మృతికి సహచర న్యాయవాదులు సంతాపం తెలిపారు. శంకరన్న భౌతికకాయాన్ని బార్ కౌన్సిల్ సభ్యులు కొల్లి సత్యనారాయణ, మేకల సుగుణారావు, బిచ్చాల తిరుమలరావు, బార్ అసోసియేషన్ నేతలు సందర్శించి, సంతాపం తెలిపి, కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు.