calender_icon.png 27 October, 2024 | 12:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీనియర్ జర్నలిస్ట్ పెర్క రమేష్ మృతి తీరని లోటు

28-08-2024 10:30:19 AM

పెద్దపెల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు

పెద్దపల్లి, (విజయక్రాంతి): పెద్దపల్లి పట్టణంలో  సీనియర్ జర్నలిస్టు (సిటి కేబుల్) పెర్క రమేష్ మృతి తీరని లోటని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రామారావు అన్నారు. మంగళవారం రాత్రి గుండె పోటుతో మృతి చెందగా, రమేష్ మరణ వార్త తెలుసుకొని ఎమ్మెల్యే విజయ రమణారావు బుధవారం  పెద్దపల్లి పట్టణంలోని వారి నివాసానికి చేరుకొని పెర్క రమేష్  భౌతిక కాయానికి పూల మాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించారు.

ఈ కార్యక్రమంలో పెద్దపల్లి పట్టణ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు. రమేష్  మంగళవారం రోజున రాత్రి గుండె పోటుతో మృతి చెందగా, రమేష్ మరణ వార్త తెలుసుకొని బుధవారం  ఉదయం పెద్దపల్లి పట్టణంలోని వారి నివాసానికి చేరుకొని  పెర్క రమేష్ భౌతిక కాయానికి పెద్దపెల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు పూల మాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, తన ప్రగాఢ సానుభూతి సంతాపాన్ని తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి పట్టణ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు,  తదితరులు పాల్గొన్నారు.