* సెప్టిక్ ట్యాంక్‌లో మృతదేహం లభ్యం
* ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌లో ఘటన
రాయ్‌పూర్, జనవరి 3: ఛత్తీస్‌గఢ్‌లో సీనియర్ జర్నలిస్ట్ ముకేష్ చంద్రశేఖర్ అనుమా నాస్పద స్థితిలో మృతి చెందారు. ఆయన మృతదేహాన్ని స్థానిక కాంట్రాక్టర్ సురేశ్ చంద్రశేఖర్ కొత్తగా నిర్మించిన సెప్టిక్ ట్యాంక్ లో శుక్రవారం లభ్యమైంది. జనవరి 1 నుం చి ముకేష్ కనిపించకుండా పోయారు.
ఆయన కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న అధికారులు పక్కా అధారాలతో సురేశ్ కొత్తగా నిర్మించిన సెప్టిక్ ట్యాంక్‌ను తవ్వించి, అందులోంచి ముకేష్ మృతదేహాన్ని బయటకు తీశారు. అవినీతిపై ప్రశ్నించిన కారణంగానే కాంట్రాక్టర్ సురేశ్.. ముకేష్‌ను హతమార్చినట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న అధికారులు సమగ్ర దర్యాప్తు చేస్తున్నారు. కాగా, వామపక్ష, అవినీతికి వ్యతిరేకంగా ముకేశ్ తన కలంతో పోరాటం చేశారు.