తన చావుకు పలువురు కారణమని సూసైడ్ నోట్
పెద్దపల్లి/రామగుండం, ఆగస్టు 7 (విజయక్రాంతి): ఉరేసుకుని సీనియర్ జర్నలిస్టు ఆత్మహత్య చేసుకు న్న ఘటన గోదావరిఖనిలో కలకలం రేపింది. తెలిసిన వివరాల ప్రకారం.. పట్టణానికి చెందిన నాయిని మధునయ్య (65) సింగరేణి కార్మికుడు. ఒకవైపు సింగరేణిలో పనిచేస్తూనే నాలుగు దశాబ్దాల పాటు పలు పత్రికల్లో విలేకరిగా చేశారు. సుదీర్ఘకాలం నుంచి కార్మిక ఉద్యమాల్లో ఉన్నారు. కొద్దిరోజుల నుంచి ఆయన ఆర్థిక లావాదేవీల విషయమై సతమవుతున్నారు.
ఈ నేపథ్యంలో ఇంట్లో ఉరే సుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మధునయ్యను బుధవారం తెల్లవారుజామున కుటుంబ సభ్యులు విగత జీవిగా చూశారు. ఆ గదిలో సూ సైడ్ నోట్ లభించింది. ‘నా చావుకు ప్రవీణ్ భార్య లలితతో పాటు పోచయ్య తదితరులు కారణం. ఆర్థిక లావాదేవీల నేపథ్యంలోనే నేను ఆత్మహత్య చేసుకుంటున్నా. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్, జర్నలిస్టులు ఈ విషయంలో నా కుటుం బాన్ని ఆదుకోవాలి’ అని సూసైడ్ నో ట్‌లో రాసి ఉన్నది. మధునయ్య మృ తిపై మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యే కోరుకంటిచందర్, గోదావరికని ప్రెస్‌క్లబ్ ప్రతినిధులు సంతాపం ప్రకటించారు.