calender_icon.png 9 January, 2025 | 10:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అరవింద్ కుమార్ ను ఐదు గంటలుగా విచారిస్తున్న ఏసీబీ

08-01-2025 03:43:53 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): ఫార్ములా ఈ-కార్ రేసింగ్ కేసు(Formula-E Car Racing Case)లో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్(Telangana Government Special CS Arvind Kumar) బుధవారం అవినీతి నిరోధక శాఖ ఎదుట హాజరయ్యారు. ఫిర్యాదుదారుడు దానకిశోర్ స్టేట్ మెంట్ ఆధారంగా ఈ-కార్ రేస్ కేసులో ఏ2గా ఉన్న ఐఏఎస్ ఆరవింద్ కుమర్ బుధవారం ఉదయం 10 గంటలకు బంజారాహిల్స్‌లోని ఏసీబీ ప్రధాన కార్యాలయానికి వెళ్లారు. సూమారుగా ఐదు గంటలుగా ఏసీబీ అధికారులు ఆయనను విచారిస్తున్నారు. 

2023లో హైదరాబాద్‌లో జరిగిన ఫార్ములా-ఇ రేస్ నిర్వహణలో ఆర్థిక అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై విచారణ జరుపుతున్న ఏసీబీ, ఫార్ములా-ఈ ఆపరేషన్స్ లిమిటెడ్ (ఎఫ్‌ఈవో)కి రూ.54.88 కోట్ల బదిలీపై అధికారిని ప్రశ్నిస్తున్నారు. ఏస్ నెక్ట్స్ జెన్ ఒప్పందాలపై ఏసీబీ ఆరా తీస్తుంది. అలాగే ఫార్ములా ఈ-కార్ రేసింగ్ జరిగినప్పుడు చీఫ్ ఇంజనీర్ గా ఉన్న బీఎల్ఎన్ రెడ్డి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఎదుట హాజరయ్యారు.. బీఎల్ఎన్ రెడ్డిని ఐదు గంటలుగా విచారిస్తున్న ఈడీ విదేశీ సంస్థకు రూ.45.71 కోట్లు బదిలీ చేసిన వ్యవహారంలో దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. ఏసీబీ కేసు ఆధారంగా మనీలాండరింగ్ చట్టం కింద ఈడీ కేసు దర్యాప్తు చేస్తుంది.