calender_icon.png 4 April, 2025 | 7:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మానవతవాది సీనియర్ న్యాయవాది ప్రదీప్ కుమార్

04-04-2025 01:32:03 AM

సూర్యాపేట, ఏప్రిల్ 3:-  పేదలకు ఉచిత సేవలు అందించాలనే లక్ష్యంతో సూర్యాపేట,మోతే మండలలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ మంచి పేరుకు మారుగా నిలుస్తున్న  సీనియర్ న్యాయవాది పొదిల ప్రదీప్ కుమార్ మరోసారి తన ఔన్నత్యాన్ని చాటుకున్నారు. మోతే మండల పరిధిలోని రాఘవపురం గ్రామానికి చెందిన ఆయన గత 30 సంవత్సరాలుగా న్యాయవాదిగా కొనసాగుతూ ఎందరో పేదలకు ఉచితంగా న్యాయ సేవలు అందిస్తున్నారు.

దీంతోపాటు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించి కరోనా సమయంలో ఎంతోమందికి నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. గురువారం జిల్లా కోర్టు ప్రాంగణంలో తనతో పాటు ప్రాక్టీస్ చేస్తున్న యువ న్యాయవాదులకు చేయూతనందించాలని లక్ష్యంతో రెండు కంప్యూటర్లు రెండు ప్రింటర్ లు  అందించారు ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్యామ్,  సీనియర్ సివిల్ జడ్జ్ ఫర్హీం కౌసర్, జూనియర్ సివిల్ జడ్జి గోపు రజిత, అదనపు జూనియర్ సివిల్ చర్చ్ అపూర్వ రవళి, ఆయనకు అభినందనలు తెలిపారు.