బాబాసాహెబ్ గూడెం: నల్గొండ జిల్లాలో ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై ఒకరు మృతి చెందారు. ఈ ఘటన కనగల్ మండలం బాబాసాహెబ్ గూడెంలో గురువారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... బాబాసాహెబ్ గూడెంకి చెందిన నల్లబోతు సైదిరెడ్డి అనే వ్యక్తి వ్యవసాయం పొలంలో ప్రమాదవశాత్తు విద్యుదాఘాతంతో మరణిచారు.
స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని శవపరీక్ష నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. మృతుడు కాంగ్రెస్ సీనియర్ నేతగా ఉన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.