calender_icon.png 14 October, 2024 | 3:51 AM

ఎఫ్‌డీలకు సీనియర్ సిటిజన్లు మొగ్గు రిస్క్ సాధనాలపై యువత మోజు

21-08-2024 12:30:00 AM

ఎస్బీఐ రీసెర్చ్ రిపోర్ట్

న్యూఢిల్లీ, ఆగస్టు 20: ప్రస్తుతం సీనియర్ సిటిజన్లు ఫిక్స్‌డ్ డిపాజిట్ల (ఎఫ్ డీలు) మదుపునకే సీనియర్ సిటిజన్లు కట్టుబడి ఉంటున్నారని, యువ ఇన్వెస్టర్లు మాత్ర రిస్క్‌తో కూడిన సాధనాల్లో పెట్టుబడి పెడుతున్నారని తాజా ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక వెల్లడించింది. దేశీయ బ్యాంకింగ్ వ్యవస్థలోని ఎఫ్‌డీల్లో 47 శాతం సీనియర్ సిటిజన్లవేనని, వాటిలో పన్నుల అనంతరం వచ్చే రాబడి తగ్గినప్పటికీ, సురక్షిత సాధనంగా భావిస్తూ వాటిలోనే మదుపు చేస్తున్నారనిఎస్బీఐ రీసెర్చ్ పేర్కొంది. ఇందుకు భిన్నంగా యువ మదుపరులు మాత్రం అధిక రాబడుల్ని ఆశిస్తూ మ్యూచువల్ ఫండ్లు, షేర్లు వంటి రిస్కీ సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తున్నారన్నది.

క్యాపిటల్ మార్కెట్లో మదుపు చేసేవారి సగటు వయస్సు 32 సంవత్సరాలకు తగ్గిందని, వారిలో 40 శాతం మంది 30 ఏండ్ల లోపువారేనని నివేదిక వివరించింది. దేశంలో మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్ ఖాతాలు 2014 మార్చి నుంచి 2024 జూన్‌నాటికి దాదాపు ఐదు రెట్లు పెరిగి 4 కోట్లకు చేరినట్టు ఎస్బీఐ ఎకనామిస్టులు వివరించారు. బ్యాంక్ డిపాజిట్లు మరింత ఆకర్షణీయంగా ఉండేందుకు వాటిపై పన్ను విధానాన్ని సరళీకరించాలని, వాటిని ఉపసంహరించుకునే సమయంలో కాకుం డా, డిపాజిట్ చేసేటపుడే పన్ను వసూలు చేసే విధానాన్ని పరిశీలించాలని ఎకానమిస్టులు ప్రభుత్వానికి సూచించారు.