సంగారెడ్డి (విజయక్రాంతి): ఫార్మా కంపెనీలకు భూమి కేటాయించేందుకు వికారాబాద్ జిల్లాలోని లగచర్లలో ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లిన ప్రభుత్వ అధికారులపై గ్రామస్తులు మూకుమ్మడిగా దాడులు జరిపిన ఘటనలో గ్రామంలో పలువురుని అరెస్ట్ చేయగా.. కోర్టు వారికి రిమాండ్ విధించింది. కాగా స్థలాభావంతో 16 మందిని సంగారెడ్డి సెంట్రల్ జైలుకు తరలించారు పోలీసులు. వీరందరిని నేడు బీజేపీ ఎంపీలు ఈటల రాజేందర్, డీకే అరుణ పలువురు అగ్ర నేతలు ఉదయం 11గంటలకు జైలుకు చేరుకున్నారు. 16 మందితో మూలాఖత్ అయ్యేందుకు కొద్ది సేపటి క్రితం వెళ్లారు. బలవంతంగా భూములు లాక్కోవడానికి లగచర్ల గ్రామస్తులను ప్రభుత్వం అన్యాయంగా అరెస్ట్ చేసి, భయబ్రాంతులకు గురి చేస్తోందని బీజేపీ నేతలు కాంగ్రెస్ పై తీవ్ర ఆరోపణలు చేశారు.