calender_icon.png 12 March, 2025 | 7:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన సీనియర్ అసిస్టెంట్‌

11-03-2025 12:50:42 PM

హైదరాబాద్: ఏసీబీ అధికారులు తెలంగాణలోని ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి తిమింగలాలను పట్టుకుంటున్న అధికారుల్లో మార్పు వస్తలే. ప్రతిరోజు ఎక్కడో అక్కడ అవినీతి అధికారులు పట్టుబడుతునే ఉన్నారు. తాజాగా ఖమ్మం ఎక్సైజ్(Khammam excise official) సూపరింటెండెంట్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న భూక్య సోమ్లా రూ.1,500 లంచం తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖ (Anti-Corruption Bureau) అధికారులు పట్టుకున్నారు. లైసెన్స్ ఫోటోకాపీ ఇవ్వడానికి బదులుగా అతను ఆ మొత్తాన్ని డిమాండ్ చేశాడు. ఈ ఆపరేషన్‌కు ఏసీబీ డీఎస్పీ వై. రమేష్ నాయకత్వం వహించారు. ఈ నెలలో ఏసీబీ విజయవంతంగా నమోదు చేసిన ఆరో కేసు ఇది కావడం గమనార్హం.