మళయాళం సినీ నటుడు మోహన్ లాల్ కీలక నిర్ణయ తీసుకున్నారు. మంగళవారం మళయాళం మూవీ ఆర్టీస్ట్స్ అసోసియేషన్ అధ్యక్ష పదవికి మోహన్ లాల్ రాజీనామా చేశారు. ఆయనతో పాటు అసోసియేషన్ కు చెందిన మొత్తం 17 మంది సభ్యులు కూడా రాజీనామా చేశారు. ఈ మేరకు 'అమ్మ (ఎఎంఎంఎ)' సంఘం ఓ ప్రకటనలో వెల్లడించింది. మలయాళం చిత్ర పరిశ్రమలో మహిళల స్థితిగతులపై జస్టిస్ హేమ కమిటీ సమర్పించిన నివేదికలో పలు దిగ్బ్రాంతికర విషయాలు వెలుగుచూశాయి. చిత్ర పరిశ్రమలో పనిచేస్తున్న మహిళలు క్యాస్టింగ్ కౌచ్, లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్నారని నివేదికలో వెల్లడించింది.