calender_icon.png 30 October, 2024 | 11:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దరఖాస్తులను ఆయా శాఖాధిపతులకు పంపండి

12-07-2024 01:16:01 AM

జేఏడీ అధికారులకు జీవో 317 సబ్ కమిటీ ఆదేశం

మంత్రి దామోదర్ రాజనర్సింహ అధ్యక్షతన సబ్ కమిటీ భేటీ

హైదరాబాద్, జూలై 11 (విజయక్రాంతి) : జీవో నంబర్  317పై ఏర్పాటు చేసిన సబ్ కమిటీ గురువారం సమావేశమైంది. రాష్ర్ట వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల మంత్రి దామోదర్ రాజనర్సింహ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

సమావేశానికి సబ్ కమిటీ సభ్యులు, మంత్రులు దుద్దిల్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ గౌడ్  హాజరయ్యారు. స్పౌజ్, మెడికల్, మ్యూచువల్, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల భార్య, భర్తలు చేసుకున్న దరఖాస్తులపై కమిటీ సానుకూలంగా స్పందించింది. క్యాబినెట్ సబ్ కమిటీకి చేసుకున్న దరఖాస్తులను సంబంధిత శాకాధిపతులకు పంపించాల్సిందిగా జేఏడీ అధికారులను కమిటీ ఆదేశించింది. మిగతా దరఖాస్తులను వివిధ శాఖలకు పంపి వాటిని పరిశీలించిన తర్వాత తిరిగి క్యాబినెట్ సబ్ కమిటీ దృష్టికి తీసుకురావాలని నిర్ణయించింది. క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశంలో రాష్ర్ట ప్రభుత్వ కార్యదర్శి రఘునందన్ రావు, శివశంకర్ (రిటైర్డ్ ఐఏఎస్), జేఏడీ అధికారులు పాల్గొన్నారు.