calender_icon.png 21 October, 2024 | 1:30 AM

అందరినీ బయటకు పంపి..

24-07-2024 12:00:00 AM

వరుస సినిమాలు, వెబ్ సిరీస్‌లతో అలరిస్తున్న నటీమణుల జాబితాలో అంజలి పేరు ముందు వరుసలో ఉంటుంది. తాజా గా ‘బహిష్కరణ’ సిరీస్‌లో మెయిన్ రోల్ నటించి ప్రేక్షకాదరణ పొందిందీ భామ. ఈ ఈ సిరీస్ సక్సెస్ మీట్ కూడా మంగళవారం జరిగింది. ఇదిలా ఉండగా, నటి అంజలి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ‘బహిష్క రణ’ సిరీస్ టీమ్‌తో జర్నీ సందర్భంగా తాను పొందిన అనుభవాలను పంచుకుంది. ఇందులోని ఇంటిమేట్ సీన్స్‌పై స్పందించటంతోపాటు కెరీర్ గురించి కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. “కెరీర్ ఆరంభం నుంచే నాకు మంచి పాత్రలు వచ్చాయి. నా పాత్రకు ప్రాధాన్యం ఉన్న ప్రాజెక్టులనే ఎంచుకున్నా. ప్రతి సినిమాకూ హోమ్‌వర్క్ చేస్తా. కొన్ని సినిమాల కోసం మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నా. యాక్షన్ సన్నివేశాలు కూడా డూప్ లేకుండా చేస్తా. ‘నవరస’ సిరీస్ సందర్భంలోనైతే కాస్ట్యూమ్ కారణంగా కొన్ని గంటల పాటు వాష్‌రూమ్‌కు కూడా వెళ్లలేకపోయా.

‘బహిష్కరణ’లో షూటింగ్ టైమ్‌లో అందరినీ బయటకు పంపి ఇంటిమేట్ సన్నివేశాలు చిత్రీకరించారు.. అయినప్పటికీ ఆ సీన్ చేసేటప్పుడు కొంచెం టెన్షన్‌గా ఫీలయ్యా.. ఇప్పటివరకు అలాంటివి చేయకపోవటమే అందుకు కారణం” అని వివరించింది అంజలి. ఇంకా సోషల్ మీడియా గురించి చెప్తూ.. ‘సోషల్ మీడియాలో వచ్చే నెగెటివిటీ గురించి పట్టించుకోను. ఎవరైనా నా గురించి తప్పుగా రాసింది చదివినప్పుడు మనసుకు బాధగా ఉంటుంది. కానీ, వెంటనే మర్చిపోతాను. ఇతరుల కోసం పని చేయటం మానేశా. నా పెళ్లి గురించి వార్తలు వస్తున్నాయి.. ఆ వార్తల్ని చూసి పెళ్లి చేసుకోలేం కదా.. సమయం వచ్చినప్పుడే చేసుకుంటా” అని చెప్పుకొచ్చింది.