calender_icon.png 14 February, 2025 | 4:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వక్ఫ్ బిల్లు నివేదికకు పెద్దలసభ ఆమోదం

14-02-2025 01:33:22 AM

* నివేదికను సభలో ప్రవేశపెట్టిన ఎంపీ మేధా కులకర్ణి

* ప్రతిపక్షాలు తీవ్ర నిరసన.. సభ నుంచి వాకౌట్

* నకిలీ నివేదికంటూ కాంగ్రెస్ చీఫ్ ఆరోపణ

* లోక్‌సభ ముందుకు కొత్త ఆదాయపు పన్ను బిల్లు

* ముగిసిన తొలి విడుత బడ్జెట్ సమావేశాలు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 13: వక్ఫ్ బిల్లుపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) స మర్పించిన నివేదికకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. గురువారం ఉదయం 11 గంటలకు రాజ్యసభ సమావేశమైంది. ఈ నేప థ్య ంలోనే వక్ఫ్ బిల్లుపై జేపీసీ ఇచ్చిన నివేదికను బీజేపీ ఎంపీ మేధా కులకర్ణి సభలో ప్రవేశపెట్టారు. ఈ నివేదికపై ప్రతిపక్షాలు తీవ్ర నిరసన వ్యక్తం చేసినప్పటికీ పెద్దల సభ దానికి ఆమోదం తెలిపింది. అనంతరం ఆ నివేదికను జేపీసీ చైర్మన్ జగదాంబికా పాల్ లోక్‌సభ ముందుకు తీసుకెళ్లారు. 

ఖర్గేకు రిజిజు కౌంటర్

జేపీసీ నివేదిక నుంచి ప్రతిపక్ష నేతలు స మర్పించిన అసమ్మతి నోట్‌లను తొలగించారంటూ ఖర్గే చేసిన వ్యాఖ్యలను మంత్రి కిరణ్ రిజిజు ఖండించారు. ఎటువంటి నోట్‌లను తొలగించలేదని స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు అనవసరంగా రాద్దాంతం చేస్తున్నాయని మండిపడ్డారు. 

సెలెక్ట్ కమిటీకి కొత్త ఆదాయపు పన్ను బిల్లు

తీవ్ర గందరగోళం మధ్యే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నూతన ఆదాయపు పన్ను  బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఈ క్రమంలో ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన బి ల్లులో పాత చట్టంలో కంటే ఎక్కువ సెక్షన్లు ఉ న్నాయంటూ ఎంపీ ప్రేమచంద్రన్ వ్యక్తం చే సిన అభ్యంతరంపై మంత్రి స్పందించారు.

పాత చట్టం అమలులోకి వచ్చిన సమయంలో అందులో 298 సెక్షన్లు మాత్రమే ఉన్నాయన్నారు. అయితే కాల క్రమంలో వాటి సంఖ్య 819కి చేరినట్టు పేర్కొన్నారు. తమ ప్రభుత్వం కొత్తగా తీసుకొస్తున్న బిల్లులో 536 సెక్షన్లు మాత్రమే ఉన్నాయని వివరించారు. కొత్త ఆదాయపు పన్ను బిల్లు లోక్‌సభలో ప్రవేశపె ట్టే సమయంలో ప్రతిపక్ష ఎంపీలు సభ నుంచి వాకౌట్ చేశారు.

బిల్లును సెలెక్ట్ కమిటీకి ప ంపనున్నట్టు.. కమిటీ నియమ నిబంధనలను స్పీకర్ నిర్ణయిస్తారని నిర్మ లమ్మ పేర్కొన్నారు. బిల్లుపై కమిటీ తన నివేదికను రెండో విడత సమావేశాల్లో సమర్పిస్తుందని వెల్లడించారు. గురువారంతో తొలి విడు త బడ్జెట్ సమావేశాలు ముగియడంతో.. లోక్‌సభను వాయిదా వేశారు. రెండో విడుత స మావేశాలు మార్చి 10 నుంచి మొదలవనున్నాయి. 

నకిలీ నివేదిక: ఖర్గే

వక్ఫ్ బిల్లు మీద జేపీసీ ఇచ్చిన నివేదికపై రాజ్యసభ ప్రతిపక్షనేత ఖర్గే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. నివేదికపై చర్చ సందర్భంగా మాట్లాడుతూ.. దా న్ని నకిలీ రిపోర్టుగా అభివర్ణించారు. ‘జేపీసీ నివేదికలో చాలా మంది ప్రతిపక్ష సభ్యులు తమ అసమ్మతిని తెలియజే స్తూ నోట్‌లు సమర్పించారు.

అయితే ఆ నోట్‌ల ను అందులోంచి మా అభిప్రాయాలను అణచివేశారు. అలా చే యడం సరికాదు. ఇది ప్రజాస్వామ్యాని కి విరుద్ధం. మేము ఇలాంటి నకిలీ నివేదికలను ఎ ప్పటికీ అంగీకరించం. నివేదికలో భిన్నాభ్రియాలు లేకపోతే దాన్ని తిరిగి జేపీసీకి పంపించాలి’ అని పేర్కొన్నారు. నివేదికపై రాజ్యసభలో చర్చ జరుగుతుండగా ప్రతిపక్ష నేతలు సభ నుంచి వాకౌట్ చేశారు.