30-03-2025 12:35:08 AM
రూ.750.81 కోట్లతో బడ్జెట్
హైదరాబాద్ సిటీ బ్యూరో, మార్చి 29 (విజయక్రాంతి): ఉస్మానియా యూనివర్సిటీ 2025 బడ్జెట్ రూ.750.81 కోట్లకు యూనివర్సిటీ సెనేట్ ఆమోదం తెలిపింది. ఓయూ వైస్-ఛాన్సలర్ ప్రొఫెసర్ కుమార్ మొలుగరం మాట్లాడుతూ.. ఎన్‌ఐఆర్‌ఎఫ్ 2024లో రాష్ట్ర ప్రభుత్వ విశ్వవి ద్యాలయాలలో ఓయు 6వ స్థానాన్ని సాధించడం గర్వకారణం అన్నారు. అంతర్జాతీయ సహకారాలను బలోపేతం చేసే క్రమంలో, ఆబర్న్ విశ్వవిద్యాలయం, ప్రముఖ టెక్ కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు తెలియజేశారు. 2024- విద్యా సంవత్సరంలో 43 ప్రభావవంతమైన సెమినార్లు, సమావేశాలు నిర్వహించామని, హాస్టల్, ఐటీ, మౌలిక సదు పాయాల అభివృద్ధికి భారీగా పెట్టుబడులు పెట్టామని వివరించారు.