26-04-2025 12:00:00 AM
కలెక్టర్ వెంకటేష్ ధోత్రే
కుమ్రం భీం ఆసిఫాబాద్,ఏప్రిల్25 (విజయక్రాంతి): భూ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూభారతి నూతన ఆర్‌ఓఆర్ చట్టంలో పొందుపరి చిన అంశాలు, హక్కులపై రైతులకు అవగాహన కల్పించేందుకే సదస్సులు నిర్వహించ డం జరుగుతుందని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు.
శుక్రవారం జిల్లాలోని పెంచికల్పేట్ ,కౌటాల మండల లో భూభారతి నూతన చట్టంలో పొందుపరిచిన అంశాలపై రైతులకు ఏర్పాటుచేసిన అవగాహన సదస్సులో ఉమ్మడి జిల్లా శాసనమండలి సభ్యు లు దండే విఠల్, జిల్లా అదనపు కలెక్టర్ డేవిడ్, సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్లా, మార్కెట్ కమిటీ చైర్మన్ సుద్దాల దేవయ్యలతో కలిసి హాజరయ్యారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భూభారతి నూతన ఆర్ ఓఆర్ చట్టంలోని అంశాల ద్వారా రైతు భూ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని, ఈ చట్టంపై ప్రతి రైతు అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. అంబేద్కర్ జయంతి రోజున ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భూభారతి చట్టాన్ని ప్రారంభించింది అని, ఈ చట్టంలో ముఖ్యంగా అప్పీలు వ్యవస్థ చాలా కీలకమని తెలిపారు.
తహసిల్దార్ జారీ చేసిన ఉత్తర్వులపై రైతుకు న్యాయం జరగకపోతే రాజస్వ మండల అధికారి / సబ్ కలెక్టర్ కు అప్పీలు చేసుకోవచ్చని, అక్కడ న్యాయం జరగకపోతే కలెక్టర్ ద్వారా న్యాయం పొందవచ్చని తెలిపారు. భూమి కొనుగోలు, పాలు పంపకం, వారసత్వ భూమి మార్పిడిలో సర్వేయర్ రూపొందించిన కమతం నక్షను జతపరచడం వల్ల భవిష్యత్తులో భూ వివాదాలకు తావు లేకుండా చర్యలు తీసుకోవచ్చని తెలిపారు.
వారసత్వ భూముల విరాసత్య సమయంలో సంబంధిత కుటుంబ సభ్యులం దరికీ నోటీసులు జారీ వ్యవస్థ ఉందని, గత ధరణి చట్టంలో ఈ అవకాశాలు లేకపోవడం వల్ల అనేక వివాదాలు తలెత్తాయని అన్నా రు. ఎమ్మెల్సీ మాట్లాడుతూ ధరణి పోర్టల్ వల్ల ఏ ఒక్క సమస్య పరిష్కారం కాకపోగా వివాదాలు, గొడవలు పెరిగిపోయా యని, భూ భారతి చట్టం ద్వారా ఎలాంటి వివాదాలు లేని భూ పంపకాలు, పట్టా మార్పిడులు జరుగుతాయని తెలిపారు.
జిల్లా అదన పు కలెక్టర్ మాట్లాడుతూ భూభారతి చట్టం లో సంవత్సరాలకు కొనుగోలు చేసి 2020 సంవత్సరంలో సాదా బైనమా కింద దరఖాస్తు చేసుకున్న వారందరికీ సాదా బైనమా క్రింద అర్హులైన వారందరికీ న్యాయం జరుగుతుందని తెలిపారు. పార్ట్ బి క్రింద నమోదైన భూములు ధరణి పోర్టల్ లో కనపడలేదని, భూభారతి చట్టంలో ఈ భూములు పరిష్కరించబడతాయని తెలిపారు.
సబ్ కలెక్టర్ మాట్లాడుతూ భూభార తి నూతన ఆర్‌ఓఆర్ చట్టంలో పొందుపరిచిన అంశాల ద్వారా ప్రతి రైతుకు న్యాయం జరుగుతుందని, ప్రతి రైతు చట్టంలో పొందుపరిచిన అంశాలను తెలుసుకోవాలని తెలి పారు. అనంతరం జిల్లా కలెక్టర్ భూ భారతి చట్టంలోని అంశాలను తెలుగుతోపాటు రైతుల అభ్యర్థన మేరకు మరాఠీ భాషలో అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ పుష్పలత, మండల పరిషత్ అభివృద్ధి అధికారి కోట ప్రసాద్, వ్యవసాయ శాఖ అధికారులు, రెవెన్యూ సిబ్బంది, రైతు లు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.