calender_icon.png 30 October, 2024 | 6:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యూనివర్సిటీ సైన్స్ కళాశాలలో గణితంపై సెమినార్

30-10-2024 04:26:47 PM

కరీంనగర్ (విజయక్రాంతి): తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సౌజన్యంతో శాతవాహన యూనివర్సిటీ సైన్స్ కళాశాలలో బుధవారం జాతీయ గణిత దినోత్సవం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కళాశాల ప్రిన్సిపాల్ డా. జయంతి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి యూనివర్సిటీ ఉపకులపతి ఆచార్య. యు. ఉమేష్ కుమార్ ముఖ్య అతిధిగా హాజరై జీవితంలో గణిత ప్రాముఖ్యత వివరించాడు. దీనిలో భాగంగా ఉస్మానియా యూనివర్సిటీ గణిత విభాగం ప్రొఫెసర్ వి. నాగరాజు మరియు ప్రొఫెసర్ వి. కిరణ్ ప్రత్యేక ఆహ్వనీతులుగా హాజరై నంబర్స్ మరియు ప్రమేయలు, అవకలన సమీకరణాలకు శ్రేణి సాధనలు అనే అంశాలపై విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమానికి డా.ప్రసాద్ కన్వీనర్ గాను, డా.ఆళ్ళ రవి కుమార్ కోఆర్డినేటర్ గాను వివహరించాగా, తోటి అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు.