calender_icon.png 7 April, 2025 | 5:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సివిల్ సర్వీసెస్ సాధించడంపై సెమినార్

06-04-2025 12:00:00 AM

వీజేఐఎంలో నిర్వహణ

హైదరాబాద్, ఏప్రిల్ 5 (విజయక్రాంతి): మొదటి ప్రయత్నంలోనే సివిల్ సర్వీసెస్ సాధించడం ఎలా అనే అంశంపై యూపీఎస్సీ మాస్టర్ క్లాస్ సెమినార్‌ను శనివారం హైదరాబాద్ బాచుపల్లిలోని విజ్ఞాన జ్యోతి ఇనిస్టిట్యూ ట్ ఆఫ్ మేనేజ్మెంట్ (వేజేఐఎం)లో నిర్వహించారు. ఈ సెమినార్‌ను వింగ్స్ మీడియా, జీ5 మీడియా గ్రూప్ సంయుక్తంగా, 21వ సెంచరీ ఐఏఎస్ అకాడమీ సహకారంతో  నిర్వహించారు.

21వ సెంచరీ ఐఏఎస్ అకాడమీ చీఫ్ మెం టార్, డైరెక్టర్ డా. భావని శంకర్ విద్యార్థులతో మాట్లాడుతూ.. యూపీఎస్సీ పరీక్షలో ఉత్తీర్ణు లు అవటానికి  చుట్టూ ఉన్న అపోహలను తొలగిస్తూ, సాధారణ డిగ్రీ, పీజీ చదివిన విద్యార్థులు కూడా ఇందులో ఉత్తీర్ణులు అవుతారు అని చెప్పారు. వీజేఐఎం డైరెక్టర్ ప్రొ.డా. భార త భూషణసింగ్ మాట్లాడుతూ..

హైదరాబాద్ ను ఒక ప్రముఖ యూపీఎస్సీ కోచింగ్ హబ్‌గా గుర్తించి, ఢిల్లీ ఆధిపత్యాన్ని తగ్గించినట్టు తెలిపారు. విద్యార్థులకు ఇలాంటి సెమినార్‌లను సద్వినియోగం చేసుకుని, సివిల్ సర్వీసెస్‌లో కెరీర్ సాధనకు ధైర్యంగా ఆసక్తి చూపాలని ప్రోత్సహించారు. కార్యక్రమంలో వీజేఐఎం అకాడమిక్ డీన్ రవినాథ్, అకాడమిక్స్ హెడ్ పద్మజ, పీఆర్‌వో గోపాల్‌రెడ్డి పాల్గన్నారు.