ఏర్పాటుపై దృష్టి సారించండి
ప్రభుత్వ స్కూళ్ల పటిష్ఠతకు చర్యలు
ఒకే నమూనాతో ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు
అంగన్‌వాడీల్లో ౩వ తరగతి వరకు బోధన
గురుకులాలపై సమీక్షలో సీఎం రేవంత్‌రెడ్డి
హైదరాబాద్, జూలై 19 (విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాలలను పటిష్టం చేసేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. గ్రామీణ ప్రాంత వి ద్యార్థులకు మెరుగైన విద్యాబోధన కోసం సెమీ రెసిడెన్షియల్ పాఠశాలల ఏర్పాటుపై దృష్టి సారించాలని అధికారులను ఆదేశించా రు. వచ్చే మూడేళ్లలో ప్రభుత్వ పాఠశాలల ను పటిష్టం చేసేలా ప్రణాళికలు రూపొందించాని సూచించారు.
సెమీ రెసిడెన్షియల్, సమీకృత గురుకులాలపై డిఫ్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కలిసి సీఎం రేవంత్ శుక్రవారం సచివాలయంలో సమీక్ష నిర్వహి ంచారు. ప్రభుత్వ సెమీ రెసిడెన్షియల్ పాఠశాలల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని విద్యాశాఖ అధికారులకు సీఎం సూచించారు. అంగన్‌వాడీ పాఠశాలల్లో ప్లే స్కూల్ తరహాలో మూడో తరగతివరకు బోధించేందుకు ప్రణాళికలు రూపొందించాలని కోరారు. అంగన్‌వాడీల్లో విద్యాబో ధనకు అదనంగా మరో టీచర్‌ను నియమించాలని సూచించారు.
నాలుగో తరగతి నుం చి సెమీ రెసిడెన్షియల్ స్కూళ్లలో చదువుకునేలా విధానాలు ఉండాలని అన్నారు. గ్రా మాల నుంచి సెమీ రెసిడెన్షియల్ స్కూళ్లకు విద్యార్థులు వెళ్లేందుకు ప్రభుత్వమే రవాణా సదుపాయం కల్పించేలా ఏర్పాట్లు ఉండాలని పేర్కొన్నారు. దీనిపై విద్యావేత్తల అభి ప్రాయలు తీసుకున్నాక ఒకటిరెండు మండలాల్లో పైలట్ ప్రాజెక్టు చేపట్టాలని ఆదేశి ంచారు. ఈ పాఠశాలలకు సకల వసతులు కల్పించేందుకు ప్రభుత్వం, సీఎస్‌ఆర్ నిధు లు వాడుకోవాలని సూచించారు.
వేగంగా సమీకృత గురుకులాల నిర్మాణం
రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాన్నింటిని కలిసి ఒకే చోట నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. కొడంగల్, మధిర నియోజకవర్గాల్లో పైలట్ ప్రాజెక్టుగా వీటిని నిర్మిస్తున్నారు. ఈ గురుకులాలపై సీఎం, డిప్యూటీ సీఎం సమీక్ష నిర్వహించారు. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణం వేగంగా చేపట్టాలని సీఎం సూచించారు. ప్రతి నియోజకవర్గంలో సు మారు 20 ఎకరాల్లో వీటిని నిర్మించనున్న ట్లు తెలిపారు. సమీకృత గురుకులాల ని ర్మాణం కోసం వారం రోజుల్లో డిజైన్లు సిద్ధం చేయాలని, రాష్ట్రవ్యాప్తంగా ఈ స్కూళ్లన్నీ ఒకే డిజైన్‌లో ఉండాలని ఆదేశించారు.
49 స్కూళ్ల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం
రాష్ట్రంలో ఇంటిగ్రేటెడ్ పాఠశాలల నిర్మాణం కోసం భుముల గుర్తింపు, ఇతర మౌళిక సదుపాయాల కోసం తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వ ప్రధానకార్యదర్శి శాంతికుమారి శుక్రవారం సచివాలయంలో వివిధ సంక్షేమ శాఖల ఉన్నతాధికారులతో సమీక్షించారు. సీఎం దార్శనికత మేరకు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ వెల్ఫేర్ పాఠశాలల్లో మౌళిక సదుయాపాలు కల్పించాలని ఆదేశించారు. విశాలమైన తరగతి గదులు, ఆట స్థలాలు, తల్లిదండ్రులు తమ పిల్లలను కలవడానికి వచ్చినప్పుడు అందుకోసం ప్రత్యేక గది ఉండాలని సూచించారు. ఈ భవనాలన్నింటికి ఒకే డిజైన్ ఉండాలని సీఎస్ సూచించారు. 49 రెసిడెన్షీయల్ వెల్ఫేర్ పాఠశాలలకు ప్రతిపాదనలు సిద్ధంగా ఉన్నాయని, అందులో 8 పాఠశాలలు ఈ ఏడాది గ్రౌండింగ్‌కు సిద్ధంగా ఉన్నాయని సీఎస్‌కు అధికారులు వివరించారు.
మరో 31 రెసిడెన్షియల్ పాఠశాలలకు ఇప్పటికే జిల్లా కలెక్టర్లు భూమిని గుర్తించగా, మిగలిన 10 పాఠశాలలకు భూమి గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. పనుల పురోగతిని పర్యవేక్షించేందుకు ప్రభుత్వ సలహాదారుతో ఒక కమిటీని ఏర్పాటు చేయాలని సీఎస్ సూచించారు. ఈ కమిటీకి సోషల్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరి నోడల్ అధికారిగా, ఇతర సంక్షేమ శాఖల కార్యదర్శులు సభ్యులుగా ఉంటారని తెలిపారు. సమీక్షలో ప్రభుత్వ సలహాదారు శ్రీనివాస్‌రాజ్, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి, ఎస్సీ అభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి, టీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్ ఇతర అధికారులు పాల్గొన్నారు.