కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని సెంట్ మేరీ పాఠశాలలో సోమవారం సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన మండల విద్యాధికారి సుభాష్ మాట్లాడుతూ విద్యార్థులు చదువుపై దృష్టి సారించి ఎంచుకున్న లక్ష్యాలను చేరుకునేందుకు కృషి చేయాలన్నారు. పిల్లలు ఎప్పుడూ ప్రశాంతంగా ఉండాలని సూచించారు. వేడుకల సందర్భంగా విద్యార్థులు చేసిన నృత్యాలు అందర్నీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ సిస్టర్ త్రేస్సి యమ్మ, కరస్పాండెంట్ అన్నీ మాథ్యు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.