- తెలంగాణ ఉన్నత విద్యామండలి
- ప్రైవేట్ కాలేజీలతో చర్చలు సఫలం
హైదరాబాద్, నవంబర్ 19 (విజయక్రాంతి): ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రంలోని ప్రైవేట్ డిగ్రీ, పీజీ కాలేజీల యాజ మాన్యాలు మంగళవారం నుంచి నిరవధిక బంద్‌తోపాటు, యూజీ సెమిస్టర్ పరీక్షలు నిర్వహించబోమని సోమవారం ప్రకటించిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో కాలేజీల యాజమాన్యాలతో జరిపిన చర్చలు సఫలమైనట్లు తెలంగాణ ఉన్నత విద్యామండలి కార్యద ర్శి శ్రీరాం వెంకటేశ్ తెలిపారు. మంగళవారం నుంచి యూజీ పరీక్షలు యథావిధిగా జరుగుతాయని ఆయన ప్రకటనలో పేర్కొన్నారు.
ఫీజు బకాయిలపై సీఎంకు ఆర్.కృష్ణయ్య లేఖ
పెండింగ్ ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని మాజీ ఎంపీ ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఈమేరకు సీఎంకు మంగళవారం ఆయన లేఖ రాశారు. విద్యార్థుల చదువుకు ఆటకం కలుగుతున్నదని, ప్రభుత్వం వెంటనే స్పందించా లని కోరారు. ఫీజు బకాయిల విషయంలో ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని ప్రైవేట్ కాలేజీల యాజమాన్య సంఘాలు కృష్ణయ్యను కలిసి కోరారు.