01-04-2025 02:09:52 AM
ఎంపీ ఈటల రాజేందర్
హెచ్‌సీయూ రాష్ట్రానికే తలమానికమని, వేలమంది నిష్ణాతులను తీర్చిదిద్దిందని మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నా రు. అంతటి ప్రాధాన్యమున్న హెచ్‌సీయూ భూములను అమ్మాలనుకోవడం సర్కారు నీచమైన చర్య అని విమర్శించారు. సోమవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మాట్లాడారు. భూముల అమ్మకాన్ని అక్కడి విద్యార్థులు, అధ్యాపకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని, రాష్ట్ర ప్రజలు కూడా ఈ అం శంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారని తెలిపా రు.
హైదరాబాద్‌లో శ్మశానవాటికలకు కూ డా స్థలం దొరకని విధంగా పరిస్థితి మారిపోయిందని, సేద తీరేందుకు కనీసం పార్కుల కు స్థలం లేక నగరం కాంక్రీట్ జంగల్‌గా మారుతోందన్నారు. భూములు లాక్కోవద్దని ఆందోళన చేస్తున్న విద్యార్థుల మీద దా డిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ప్రభు త్వం ప్రజా వ్యతిరేక చర్యలు మానుకోకుంటే ప్రత్యక్ష కార్యాచరణకు కూడా సిద్ధమని హెచ్చరించారు.