calender_icon.png 18 January, 2025 | 5:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఐటీ, బ్యాంకింగ్ స్టాక్స్‌లో అమ్మకాలు

18-01-2025 01:55:16 AM

  • సూచీల అప్‌ట్రెండ్‌కు బ్రేక్
  • మరో 423 పాయింట్లు తగ్గిన సెన్సెక్స్
  • నిఫ్టీ 108 పాయింట్లు డౌన్

ముంబై, జనవరి 17: ప్రపంచ సంకేతాలు సానుకూలంగా ఉన్నప్పటికీ, బ్యాంకింగ్, ఐటీ షేర్లలో భారీ అమ్మకాలు జరగడంతో సూ చీల మూడు రోజుల అప్‌ట్రెండ్‌కు శుక్రవారం బ్రేక్‌పడింది. నేపథ్యంలో దేశంలో ద్రవ్యోల్బణం తగ్గడంతో వరుసగా మూడోరోజూ మార్కెట్ లాభపడింది. బీఎస్‌ఈ సెన్సెక్స్  ఇంట్రాడేలో 76,263 కనిష్ఠస్థాయిని తాకిన అనంతరం  చివరకు 428 పా యింట్ల నష్టంతో  76,619 పాయింట్ల వద్ద నిలిచింది. 

నిఫ్టీ 108 పాయింట్లు క్షీణించి  23,203పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఎడతెగని విదేశీ ఫండ్స్ విక్రయాలు, క్రూడ్ ధరల పెరుగుదల ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌పై ప్రతికూల ప్రభావం చూపించినట్లు ట్రేడర్లు తెలిపారు. ఈ వారం మొత్తంమీద సెన్సెక్స్ 759 పాయింట్లు, నిఫ్టీ 228 పాయింట్ల చొప్పున తగ్గాయి.

ప్రధాన ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్, ప్రైవేటు రంగ యాక్సిస్ బ్యాంక్ ఆర్థిక ఫలితాలు నిరాశపర్చడంతో ఆయా రంగాల షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయని, రిలయన్స్, ఐటీసీ, ఎల్ అండ్ టీ షేర్ల పెరుగుదల సూచీల నష్టాల్ని పరిమితం చేశా యని రెలిగేర్ బ్రోకింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అజిత్ మిశ్రా చెప్పారు. 

ఇన్ఫీ డౌన్..రిలయన్స్ అప్

గురువారం క్యూ3 ఫలితాలు వెల్లడించిన ప్రధాన కంపెనీల్లో ఇన్ఫోసిస్ షేరు 6 శాతం వరకూ క్షీణించగా, రిలయన్స్ ఇండస్ట్రీస్ 2.5 శాతం వరకూ పెరిగింది. సెన్సెక్స్ ప్యాక్‌లో ఇన్ఫోసిస్ తర్వాత అలాగే యాక్సిస్ బ్యాంక్ ఫలితాలు మెప్పించకపోవడంతో ఈ షేరు 4 శాతంపైగా నష్టపోయింది. కోటక్ మహీంద్రా బ్యాంక్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఐసీఐ సీఐ బ్యాంక్, టెక్ మహీంద్రా, బజాజ్ ఫైనాన్స్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లు 3 శాతం వరకూ తగ్గాయి.

రిలయన్ప్ ఇండస్ట్రీస్, భారతి ఎయిర్‌టెల్, జొమాటో, నెస్లే, ఏషియన్ పెయింట్స్, పవర్‌గ్రిడ్ షేర్లు 2.5 శాతం వరకూ లాభపడ్డాయి. వివిధ రంగాల సూచీల్లో అధికంగా ఐటీ ఇండెక్స్ 2.57 శాతం తగ్గింది. టెక్నాలజీ సూచి 2.15 శాతం, బ్యాంకెక్స్ 1.83 శాతం, ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇండెక్స్ 1.18 శాతం చొప్పున తగ్గాయి.హెల్త్‌కేర్, రియల్టీ, మెటల్, క్యాపిటల్ గూడ్స్ సూచీలు లాభపడ్డాయి. 

కొనసాగిన  ఎఫ్‌పీఐ విక్రయాలు

దేశీయ స్టాక్ మార్కెట్లో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్‌పీఐలు)  విక్రయాలు కొనసాగుతున్నాయి. శుక్రవారం మరో రూ.3,318 కోట్ల నికర విక్రయాలు జరిపినట్లు స్టాక్ ఎక్సేంజీల ప్రాధమిక గణాం కాలు వెల్లడిస్తున్నాయి. దీంతో ఈ వారం వరుస 9 రోజుల్లో వీరి నికర అమ్మకాలు రూ. 35,000  కోట్లు మించాయి. 

డాలర్ పటిష్టంగా ఉంటూ యూఎస్ బాండ్ ఈల్డ్స్ ఆకర్షణీయమైన రాబడులు ఇస్తున్నంతకాలం ఎఫ్‌పీఐలు భారత్ మార్కెట్లో విక్ర యాలు కొనసాగిస్తారని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజిస్ట్ వీకే విజయ్‌కుమార్ చెప్పారు. ప్రస్తుతం డా లర్ ఇండెక్స్ 109 వద్ద, 10 ఏండ్ల బాండ్ ఈ ల్డ్ 4.75 శాతం వద్ద ఉన్నాయని  తెలిపారు.