నిందితుడి అరెస్టు
హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 2 (విజయక్రాంతి): అప్పుల నుంచి బయటపడేందుకు డ్రగ్స్ విక్రేతగా మారిన ఓ వ్యక్తి పోలీసులకు చిక్కడంతో కటకటాలపాలయ్యాడు. టాస్క్‌ఫోర్స్ డీసీపీ వైవీఎస్ సుధీంద్ర తెలిపిన వివరాలు.. బంజారాహిల్స్ రోడ్‌నంబర్ 12లో నివాసముండే జావర్ కిషన్ గోపాల్ బెట్టింగ్‌కు బానిసై అప్పులపాలయ్యాడు.
డ్రగ్స్ వ్యాపారం ద్వారా సులభంగా డబ్బు లు సంపాదించొచ్చని స్నేహితులు సలహా ఇవ్వడంతో నూతన సంవత్సర వేడుకల్లో విక్రయించేందుకు ప్రయత్నించాడు. సమాచారం అం దుకున్న పోలీసులు మెహదీపట్నం లో గురువారం కిషన్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి 30 గ్రాముల కొకైన్, 6గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ట్రాస్క్‌ఫోర్స్ సీఐ జంగయ్య, ఎస్సై నవీన్ దాడుల్లో పాల్గొన్నారు.