* నిబంధనలు పాటించని మద్యం దుకాణాలు
నాగర్‌కర్నూల్, జనవరి 19 (విజయక్రాంతి): నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని మద్యం దుకాణాలు నిబంధనలను పాటించకుండా తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ చిన్నారులకు బాలబాలికలకు కూడా మద్యం అమ్మకాలు జరుపుతున్నారు. మరికొన్ని మద్యం దుకాణాలు అక్రమ సంపాదనే లక్ష్యంగా దుకాణాల ముందే మద్యం తాగుతూ ఇతర ప్రయాణికులకు బాటసారులకు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు.
ఆదివారం జిల్లా కేంద్రంలోని నాగనూలు చౌరస్తాలో గల ఓ మద్యం దుకాణం ముందు బాలికలకు మద్యం అమ్మకాలు జరుపుతూ కనిపించారు. సిట్టింగ్ కేంద్రాలు సైతం నిబంధనలకు విరుద్ధంగా విశాలమైన స్థలంలో పర్మిట్ రూములను ఏర్పాటు చేసుకొని మద్యం విక్రయాలు జరుపుతున్నారని ప్రచారంలో ఉంది.
అయినా సంబంధిత ఎక్సైజ్ శాఖ అధికారులు మాత్రం తమకేమీ సంబంధం లేదన్నట్లుగా వ్యవహరించడంతో మద్యం దుకాణాదారులు ఇష్టా రీతిగా వ్యవహరిస్తున్నారని సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతు న్నాయి. ఈ విషయంపై జిల్లా ఎక్సైజ్ శాఖ అధికారిని గాయత్రిని వివరణ కోరెందుకు ప్రయత్నించగా తాను అందుబాటులోకి రాలేదు.