calender_icon.png 21 April, 2025 | 1:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దళారులను నమ్మి మోసపోకండి

20-04-2025 10:36:08 PM

ప్రభుత్వ జొన్న కొనుగోలు కేంద్రంలోని విక్రయించండి..

కంగ్టి (విజయక్రాంతి): మండల పరిధిలోని తడ్కల్ రైతు వేదిక మార్క ఫెడ్ ఆధ్వర్యంలో వ్యవసాయ సహకార సంఘం ద్వారా జొన్నల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే డాక్టర్ పి సంజీవరెడ్డి(MLA Sanjeeva Reddy), జహిరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ శేట్కర్(MP Suresh Shetkar) ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... రైతులు జొన్నలను ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోని అమ్మాలని దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు.

రైతులకు అన్ని విధాలుగా అండగా ఉండే కాంగ్రెస్ ప్రభుత్వమే ముందుంటుందని పేర్కొన్నారు. రైతులకు అవసరపడే వ్యవసాయ పనిముట్లను సబ్సిడీ ద్వారా రైతులకు అందిస్తున్నామని అన్నారు. జొన్నలకు 3371 రూపాయల మద్దతుతో కొనుగోలు చేస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వ హయంలో రైతులకు అన్యాయం జరిగిందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ ఆవిర్భావంతో రైతుల వద్ద నుండి ప్రతి గింజ వరకు ధాన్యం కొనుగోలు చేసి, వారం రోజుల వ్యవధిలో రైతుల ఖాతాలో డబ్బులు జమవుతున్నాయని అన్నారు. వారి వెంట మండల వ్యవసాయ అధికారులు, కాంగ్రెస్ కార్యకర్తలు రైతులు తదితరులు పాల్గొన్నారు.