calender_icon.png 16 April, 2025 | 2:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించి మద్దతు ధర పొందాలి

15-04-2025 12:49:34 AM

దౌల్తాబాద్, ఏప్రిల్ 14: రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలుకేంద్రాలలోనే విక్రయించి మద్దతు ధరను పొందాలని ఏపీఎం కిషన్ అన్నారు. సోమవారం రాయపోల్ మండలం మంతూర్,రాయపోల్, రామారం, గొల్లపల్లి, టెంకంపేటతో పాటు పలు గ్రామలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు.

ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులను ఆదుకోవడం కోసం గ్రామాలలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలు చేస్తుందన్నారు. రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటలకు దళారులను నమ్మి తక్కువ ధరకు దాన్యం విక్రయించి మోసపోవద్దని, ఐకేపీ, పిఎసిఎస్ ఆధ్వర్యంలో గ్రామాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని రైతులు అందరు ఆయా కేంద్రాల్లో ధాన్యం విక్రయించాలన్నారు.

రైతులు పంటను కోసిన వెంటనే తమ పొలాల వద్దనే ఆరాపెట్టుకొని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలన్నారు. అధికారులు ధాన్యం తూకం వేసేటప్పుడు ఒక బస్తాకు 41 కిలోలు మాత్రమే కొనుగోలు చేయాలి అధికంగా తూకం వేసినట్లు తమ దృష్టికి వస్తే అధికారులపై చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ప్రభుత్వం ఏ గ్రేడ్ వరి ధాన్యానికి రూ. 2320, బి గ్రేడ్ వరి ధాన్యానికి రూ. 2300 మద్దతు ధరను కేటాయించి ధాన్యం కొనుగోలు చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సీసీలు రాజేశ్వరరావు, కిష్టయ్య, ప్రవీణ్, రవీందర్, ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శిలు, వివోఏలు తదితరులు పాల్గొన్నారు..