calender_icon.png 20 April, 2025 | 4:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిస్వార్థ సేవకురాలు చిట్టెమ్మ: ఎమ్మెల్యే ఉత్తం పద్మావతి

12-04-2025 05:04:32 PM

నడిగూడెంకాంగ్రెస్ పార్టీ కోసం నిస్వార్ధంగా పనిచేసి, ఎనలేని సేవలు అందించిన నాయకురాలు వేపూరి చిట్టమ్మని ఎమ్మెల్యే ఉత్తం పద్మావతి అన్నారు. కోదాడ మార్కెట్ చైర్మన్ ఏపూరి తిరుపతమ్మ సుధీర్ అత్త మాజీ వార్డు మెంబర్ చిట్టెమ్మ శనివారం మృతి చెందడంతో ఆమె పార్థివదేహనికి పూలమాల వేసి, కాంగ్రెస్ జెండా కప్పి నివాళులు అర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. చిట్టెమ్మ సేవలు చిరస్మరణియమని కొనియాడారు.

కుటుంబ సబ్యులకు సంతాపం తెలిపారు. ఈ కార్యక్రమంలో టిపిసిసి డెల్గేట్ చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి, జిల్లా గ్రంధాలయ చైర్మన్ వంగవేటి రామారావు, నడిగూడెం మండల పార్టీ అధ్యక్షుడు బూతుకూరి వెంకట్ రెడ్డి, మాజీ ఏంపిటిసి గుండు శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ మండల వర్కింగ్ పెసిడెంట్ గుండు శ్రీను, కోదాడ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ కందుల కోటేశ్వరరావు, నడిగూడెం గ్రామ శాఖ అధ్యక్షులు బొల్లా నర్సిరెడ్డి, మండల కాoగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.