calender_icon.png 23 January, 2025 | 3:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సెల్ఫీయే శరణ్యం..

23-01-2025 12:56:05 AM

  1. ఏండ్లుగా దొరకని మావోయిస్టు అగ్రనేత
  2. చనిపోయిన తర్వాత సెల్ఫీ వల్ల గుర్తింపు 
  3. చలపతి విషయంలో విస్తుపోయే నిజాలు

న్యూఢిల్లీ, జనవరి 22: జయరాం రెడ్డి అలియాస్ చలపతి రెండ్రోజుల క్రితం చత్తీస్‌గఢ్‌ొోఒడిషా సరిహద్దులో ప్రాణాలు కోల్పో యాడు. దళంలో అగ్రనేతగా కొనసాగుతు న్న చలపతి కోసం పోలీసులు ఏండ్లుగా వెతుకుతున్నారు. కానీ ఇన్ని రోజు లు చలప తి వారికి చిక్కలేదు. కానీ తాజాగా జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఆయన ప్రాణాలు కోల్పోయారు.

చాలా రోజుల క్రితం ఆయన తన భార్యతో తీసుకున్న ఓ సెల్ఫీ వల్ల పోలీసులు ఆయన్ను గుర్తించేందుకు వీలుపడింది. ఆయన భార్య అ రుణ కూడా మావోయిస్టు దళ సభ్యురాలే కావడం విశేషం. చలపతి తలమీద రూ.కోటి రివార్డు ఉన్నా ఇంత వరకు ఎవరూ అతడిని తాకలేకపోయారంటేనే అతడి నెట్‌వర్క్ ఏంటో మనం ఇట్టే అర్థం చేసుకోవచ్చు.

2008 ఫిబ్రవరిలో ఒడిషాలో జరిగిన పేలుడులో చలపతిదే మాస్టర్ మైండ్. ఆనాటి ఘటనలో 13 మంది భద్ర తా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. 

సెల్ఫీనే ముఖ్యం.. 

అగ్రనేత చలపతి తన భార్య అరుణతో తీసుకున్న సెల్ఫీ  ఆయన్ను భద్రతాబలగాలు గుర్తించేలా సహాయపడింది. ఆయన సతీమణి అరుణ ఆంధ్ర సరిహద్దు స్పెషల్ జోనల్ కమిటీ డిప్యూటీ కమాండర్‌గా కొనసాగుతోంది. 2016 మేలో ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో భద్రతా దళాలకు మావోయిస్టుల ఫోన్ దొరికింది.

ఆ ఫోన్‌లో చలపతికి సంబంధించిన ఫొటో భద్రతా దళాలకు లభించింది. చలపతిది ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు ప్రాంతం. చలపతి సెంట్రల్ కమిటీలో సీనియర్ మెంబర్. ఆయన చుట్టూ కాపలాగా ఎప్పుడూ 8-10 మంది ఉండేవారు. చలపతి తలమీద రూ. కోటి రివార్డ్ కూడా ఉంది. మిలటరీ, గెరిల్లా యుద్ధ విన్యాసాల్లో చలపతి ఎక్స్‌పర్ట్.