హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 20 (విజయక్రాంతి): స్వావలంబి భారత్ అభియాన్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి ఆఖరి వారంలో జీహెచ్‌ఎంసీ పరిధిలో లోన్‌మేళా నిర్వహిస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు. ఈ మేరకు లోన్ మేళా పోస్టర్‌ను సోమవారం ఆవిష్కరించారు.
జీహెచ్‌ఎంసీ పరిధిలోని తయారీ, వర్తక రంగాలలో చిన్న వ్యాపార ఔత్సాహికులకు ఊతమివ్వడం కోసం యువ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ప్రోత్సహం అందించడానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సహకారంతో ముద్రలోన్‌కు సంబంధించిన శిశు (రూ.50 వేలు), కిషోర్ (రూ.50 వేల నుంచి రూ. 5 లక్షలు), తరుణ్ (రూ. 5 లక్షల నుంచి రూ.10 లక్షలు), స్టార్టప్ ఇండియా (రూ.50 లక్షల వరకూ) లోన్‌లను అందించడానికి మేళా నిర్వహించడం జరుగుతుందన్నారు. వివరాల కోసం మహేశ్ కులకర్ణి - 88860 02221, శేషు కుమార్ - 99856 08543, సాహిత్ కుమార్ 70135 48914 నంబర్లలో సంప్రదించాలన్నారు.