20-04-2025 12:42:24 AM
‘ఎక్స్’లో కేంద్రబొగ్గు గనులశాఖ మంత్రి కిషన్‌రెడ్డి
హైదరాబాద్, ఏప్రిల్ 19 (విజయక్రాంతి): పీఎం స్వనిధి (స్ట్రీట్ వెండర్స్ ఆత్మనిర్భర్ నిధి) పథకం ద్వారా తెలంగాణవ్యాప్తంగా 4.26 లక్షల మంది వీధి వ్యాపారులకు లబ్ధి చేకూరిందని కేంద్ర బొగ్గు గనుశాఖ మంత్రి కిషన్‌రెడ్డి శనివారం ‘ఎక్స్’లో పేర్కొన్నారు.
వ్యాపారు ల జీవనోపాధులను మెరుగుపరిచేందుకు ప్రధాని మోదీ ప్రతిష్ఠాత్మకంగా పథకాన్ని అమలు చేస్తున్నారని కొనియాడారు. పథకం ద్వారా వీధి వ్యాపా రులకు ఎలాంటి పూచీకత్తు లేకుండా రూ.50వేల వరకు అందించే ఆర్థిక సాయం అందుతుందన్నారు. అలా డిసెంబర్ 2024 నాటికి రూ.1,240 కోట్ల అందిందని స్పష్టం చేశారు. లబ్ధిదారుల్లో 65 శాతం మంది మహిళలేనని తెలిపారు.